Sunny Leone participates in the Chris Gayle Challenge క్రిస్ గేల్ ఛాలెంజ్ కు సై అన్న సన్నీ లియోన్

Sunny leone participates in the chris gayle challenge

chris gayle, dance, sunny leone, challenge, laila song, zeenat aman, #ChrisGayleDanceChallenge, Chris Gayle dance, Sunny Leone dance, Chris Gayle challenge, cricket news, sports news, sports, cricket

Sunny Leone has responded to the challenge by west Indies cricketer Chris Gayle, who showcased his dance moves crooning to the hit song 'Laila'.

క్రిస్ గేల్ ఛాలెంజ్ కు సై అన్న సన్నీ లియోన్

Posted: 07/19/2017 01:05 PM IST
Sunny leone participates in the chris gayle challenge

ఇటు క్రికెట్ అటలో అభిమానులకు విండీస్ విధ్వంసక అటగాడు క్రిస్ గేల్ గురించి పరిచయం అవసరం లేని పేరు. ఆయన చెలరేగి కనబర్చే అద్భుత ప్రతిభకు యావత్ ప్రపంచ క్రీడాభిమానుల హృదయాలను దోచుకున్నాడు. అయితే దీంతో పాటు ఆయన నృత్యం చేయడంలోనూ అదే తరహా నూతన మూమ్ మెంట్స్ తో రాణిస్తూ.. ఏకంగా యూనివర్సల్ బాస్ అని బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. తాజాగా ఆయన విసిరిన ఛాలెంజ్ కు భాలీవుడ్ హాట్ బ్యూటీ నుంచి స్పందన వచ్చింది.

ఇదేంటీ ఏంటీ ఛాలెంజ్ అంటారా..? బాలీవుడ్ లో అలనాటి నటి జీనత్ అమన్ తొలుత.. ప్రస్తుత నటి సన్నీ లియోన్ తాజాగా నటించిన రయీస్ చిత్రంలోని లైలా మై లాలా.. కైసీ హో లైలా అనే పాటపై నర్తించారు. అ పాటపై క్రిస్ గేల్ తనదైన మూమ్ మెంట్లతో నర్తించాడు. అంతటితో అగకుండా ఏకంగా సవాల్ విసిరాడు. అచ్చం తనలాగే నృత్యం చేసి మరపించే విజేతకు 5000 డాలర్లు నగదుబహుమతి ప్రకటించాడు.

దీతో ‘ఈ ఛాలెంజ్ కు తాను సిద్ధమేనంటూ సన్నీలియోనీ ప్రకటించింది. అంతటితో అగకుండా తాను గతంలో నర్తించిన డాన్స్ క్లిప్ లకు తాలుకు వీడియోలను కూడా తీసుకుని ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘క్రిస్‌గేల్‌ డ్యాన్స్‌ ఛాలెంజ్‌కు ఇదే నా ఎంట్రీ’ అని ట్వీట్‌ చేసింది. ఈ డాన్సు క్లిపులతో క్రిస్ గేల్ క్లీన్ బౌల్డ్ అవుతారా..? లేక మరిన్నీ మూమ్ మెంట్లతో పరీక్ష పెడతారా..? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chris gayle  dance  sunny leone  challenge  laila song  zeenat aman  #ChrisGayleDanceChallenge  

Other Articles