Umesh Yadav’s house burgled ఉమేష్ యాదవ్ ఇంట్లో చోరి

Umesh yadav s house burgled on the day he s appointed rbi assistant manager

Umesh Yadav, burgled, thieves, India national cricket team, Reserve Bank of India, Indian Premier League, Nagpur, india vs sri lanka, india, sri lanka, India’s tour of Sri Lanka, India, cricket news, sports news, sports, cricket

Umesh Yadav’s house was burgled on Tuesday, with mobile phones and cash amounting to Rs. 45,000 stolen from the Indian bowler’s house.

క్రికెటర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో చోరి..

Posted: 07/18/2017 06:55 PM IST
Umesh yadav s house burgled on the day he s appointed rbi assistant manager

శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమిండియా క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకున్నట్టు వార్తలు అందుకున్న క్రమంలో ఇవాళ భారత్ పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ తన సంతోషంతో పాటు ఒక చేధు వార్తను కూడా వినాల్సి వచ్చింది. ఇవాళ ఆయన భారతీయ రిజర్వు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ గా నియామకమై తన విధులకు తొలి రోజు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో దొంగలు పడి నగదును, మొబైల్ ఫోన్లను దోచుకుపోయారు. అర్బీఐలో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహించేందుకు ఇప్పటికే అందుకు సంబంధించిన వ్యవహరాలన్నింటినీ పూర్తి చేశారు.

దీంతో ఆయనకు స్వస్థలం నాగ్ పూర్ లోనే ఈ విధులు నిర్వహించేందుకు అర్బీఐ అధికారులు అంగీకరించారు. దీంతో ఆయన ఇవాళే తొలిరోజు తన విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఇంట్లోకి కొందరు దొంగలు చోరబడి అత్యంత విలువైన పలు మొబైల్ ఫోన్లతో పాటు 45 వేల రూపాయల నగదును కూడా అపహరించుకుపోయారు. ఈ మేరకు ఆయన కుటింబికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఎన్ని సెల్ ఫోన్లు పోయాయన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Umesh Yadav  burgled  thieves  Reserve Bank of India  IPL  Nagpur  sri lanka tour  India  cricket  

Other Articles