Irfan Pathan trolled for posting wife's Picture సతితో దిగిన పోస్టుతో.. క్రికెటర్ పతిపై విమర్శలు..

Irfan pathan trolled for posting un islamic image with wife

irfan pathan, irfan pathan facebook, irfan pathan wife, irfan pathan selfie with wife, irfan pathan wife image viral, irafan pathan wife safa baig, pathan, safa baig, irfan pathan wife, irfan pathan unislamic image, cricket news, sports news, sports, cricket

Irfan Pathan, who uploaded a picture with his wife Safa Baig for the first time on social media, was ridiculed for showing her face and arms and nail polish in picture uploaded by Pathan on Facebook.

సతితో దిగిన పోస్టుతో.. క్రికెటర్ పతిపై విమర్శలు..

Posted: 07/18/2017 06:15 PM IST
Irfan pathan trolled for posting un islamic image with wife

భార‌త క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఆయన సతి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అదెలా అంటే.. అమె తన భర్తతో దిగిన ఓ ఫోటో నెట్ జనులు లైక్ లను అందుకుంటుండగా, మతవాదులు నుంచి మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. అయితే ఇందులో అమె తప్పేం లేకున్నా అమెనే నిందిస్తున్నారు మత చాంధసవాదులు. ఇర్ఫాన్ ఫఠాన్ త‌న భార్య స‌ఫా బైగ్ తో కలిసి దిగిన ఓ సెల్ఫీ.. ఇర్ఫాన్ ను మతవాదుల మధ్య దోషిని చేస్తున్నాయి. తప్పు భార్త దైనా.. భార్యనే ముద్దాయిని చేస్తున్నారు.

అంతేకాదు మ‌తం రంగు పులిమి మరీ ఇర్ఫాన్ ను విమర్శించారు.  అమ్మాయితో పెద్ద స‌మ‌స్య‌` అంటూ త‌న భార్యతో క‌లిసి ఉన్న ఫొటోను ఇర్ఫాన్ తన సామాజిక మాద్యమంలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో సఫా బేగ్ తన ముఖం కనిపించకుండా రెండు చేతులు అడ్డం పెట్టుకున్నారు. దీనిపై ఇర్ఫాన్ అభిమానులు లైక్ ల వర్షం కురిపిస్తుండగా, కొందరు మాత్రం మతవాదాన్ని తెరపైకి తెచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే ముందుగా అర్థముఖం. ఆ తరువాత పూర్తి ముఖం, ఆ తరువాత తలపై వస్త్రం తొలగింపు, ఇలా ఇక అన్ని వదిలేసి ఫోటోలకు ఫోజులివ్వండీ అంటూ ఒక నెట్ జనులు తీవ్రంగా విమర్శించాడు.

సఫా చేతి గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టుకోవ‌డ‌మే కూడా విమర్శలకు కారణమైంది. అయితే కొందరు మాత్రం పలు సూచనలు చేశారు. నెయిల్ పాలిష్ కాదు మెహందీ పెట్టుకో! అంటూ స‌ల‌హాలు ఇచ్చారు, `ముస్లిం అయి ఉండి నీ భార్య ముఖాన్ని అంద‌రికీ చూపిస్తావా?` అంటూ కొందరు విమ‌ర్శించారు. ఇంకా కొంత మంది నెటిజ‌న్లు త‌మ హ‌ద్దు మీరి కామెంట్లు చేశారు. ఇలా భార‌త ముస్లిం క్రికెట‌ర్లకు మ‌తం రంగు పులమ‌డం ఇదేం మొద‌టిసారి కాదు. గ‌తంలో మ‌హ్మ‌ద్ ష‌మీ భార్య దుస్తుల విషయంలోనే ఇలాగే మండిపడ్డారు మతచాంధస నెట్ జనులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : irfan pathan  safa baig  facebook  photo with wife  unislamic image  cricket  

Other Articles