Bharat Arun appointed Team India bowling coach నెగ్గిన శాస్త్రి పంతం.. బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్..

Bharat arun appointed team india bowling coach until 2019 world cup

anil kumble, coach anil kumble, indian coach ravi shastri, indian bowling coach zaheer khan, bharath arun, sanjay bungar, india cricket coach, bcci, sourav ganguly, sachin tendulkar, vvs laxman, virat kohli, Team India, Bowling coach, Head coach, BCCI, CoA, CAC, cricket news, sports news, cricket

Bharat Arun has made a comeback into the Indian dressing room as he has been appointed bowling coach by the Board of Control for Cricket in India

నెగ్గిన శాస్త్రి పంతం.. బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్..

Posted: 07/18/2017 05:23 PM IST
Bharat arun appointed team india bowling coach until 2019 world cup

టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రీ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ గా తనవాడైన మాజీ భారత బౌలర్‌ భరత్‌ అరుణ్ ను నియమించడంలో తనదైన మార్కులోనే పయనించాడు. అటు రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్ లను స్వాగతిస్తూనే.. బిసిసిఐ ఎదుట తన షరతులను పెట్టాడు. తన షరతులకు అంగీకరిస్తేనే.. అన్న డిమాండుతో ముందుకు కదిలిన శాస్త్రి.. తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ వరకు భరత్ అరున్ ఈ పదవిలో ఉంటారు. ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న సంజయ్‌ బంగర్‌ను సహాయక కోచ్‌గా నియమించింది. ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ ఒప్పందాన్ని పొడగించింది.

కొత్తగా ఎంపికైన ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్ గా ఉన్నప్పుడే భరత్‌ అరుణ్‌ భారత జట్టుకు బౌలింగ్‌ కోచ్ గా సేవలను అందించాడు. కుంబ్లే కోచ్‌ కావడంతో వీరిద్దరూ ఒకేసారి జట్టును వీడారు. అండర్‌-19 నుంచి శాస్త్రి, అరుణ్‌ అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. వీరి నియామకాలను బీసీసీఐ పాలకుల కమిటీ అధినేత వినోద్‌ రాయ్‌ ఆమోదించారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ సలహాదారులు రాహుల్‌ ద్రవిడ్‌, జహీర్‌ఖాన్‌ పాత్రలపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు.

వీరిద్దరితో తాను వ్యక్తిగతంగా మాట్లాడినట్టు రవిశాస్త్రి తెలిపాడు. వారు అద్భుతమైన క్రికెటర్లు అన్నాడు. వారి సేవలు విలువైనవని ప్రశంసించాడు. ఐతే వారు జట్టుకు ఎన్ని రోజులు వారు అందుబాటులో ఉంటారనేది కీలకమన్నాడు. ఇదిలావుండగా, ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ నుంచి స్వచ్ఛంధంగా రాజీనామా చేసి బయటకు వెళ్లిన చరిత్రకారుడు రామచంద్ర గుహ అనుమానించినట్లే ద్రావిడ్, జహీర్ లను వెన్కక్కి తగ్గించింది బిసిసిఐ.

ఇటీవల ఈ విషయమై స్పందించిన రామచంద్ర గుహ ద్రావిడ్, జహీర్ ఇద్దరూ దేశంలో కోసం కొన్ని ఏళ్ల పాటు మైదానంలో శ్రమించారని, అలాంటి వారిని కూడా అనీల్ కుంబ్లేకు జరిగిన తరహాలో అవమానించి పంపడం సమంజసకం కాదని అన్నారు. కానీ చివరకు జహీర్ ఖాన్ ను బౌలింగ్ సలహాదారుడిగా నియమించి.. కోచ్ గా తప్పించడంతో అదే అవమానం పునరావృతమైందన్న విమర్శలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  ravi shastri  bharat arun  zaheer khan  rahul dravid  BCCI  CoA  CAC  cricket  

Other Articles