నాలుగో టెస్టుకు అసీస్ శతక వీరుడు దూరం.? Maxwell's spot not safe yet says Clarke

Maxwell yet to cement his place in test side says clarke

glenn maxwell, michael clarke, glenn maxwell australia, australia glenn maxwell, maxwell australia, ind vs aus, australia maxwell, india vs australia, ind vs aus, australia india, india cricket, cricket india, cricket news, cricket, sports news, sports

Michael Clarke said if Steve Smith continued to overlook Maxwell's off-spin bowling then the all-rounder's spot could be vulnerable.

నాలుగో టెస్టుకు అసీస్ శతక వీరుడు దూరం.?

Posted: 03/23/2017 05:48 PM IST
Maxwell yet to cement his place in test side says clarke

రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో అనూహ్యంగా స్థానం సంపాదించిన అసీస్ అల్ రౌండర్ మాక్స్ వెల్ శతకంతో చెలరేగినా..  ధర్మశాలలో జరిగే నాలుగో టెస్టులో స్థానం సంపాదించడం మాత్రం అనుమానంగానే కనబడుతుంది. అతని నాలుగో టెస్టులో స్థానం సంపాదించడంపై పూర్తి స్థాయి భరోసా ఇవ్వలేమని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. మ్యాక్స్ వెల్ ఒక స్సిన్ గ్రౌండ్ లపై అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ రాణించగల ఆల్ రౌండర్ అని.. అయినప్పటికీ ఆసీస్ జట్టుకు మ్యాక్స్ వెల్ రెగ్యులర్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కాదని అన్నాడు.

మరీ ముఖ్యంగా ఫాస్ట్ పిచ్ లపై ఆడేటప్పుడు మ్యాక్స్ వెల్ ఎంపిక అనేది ప్రత్యామ్నాయం లేని పక్షంలోనే వుంటుందని అభిప్రాయపడ్డాడు. దీంతోనే ధర్మశాల టెస్టులో మ్యాక్స్ వెల్ ఎంపికపై కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొగ్గు చూపే అవకాశాలు రమారమి వుండకపోవచ్చునని అన్నాడు. దీంతో నాలుగో టెస్టుకు మాక్స్ వెల్ దూరం కానున్నారని అయన చెప్పకనే చెప్పారు. అయితే మాక్స్ వెల్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తార్నది మాత్రం కెప్టెన్ స్మిత్ ఇష్టమని చెప్పారు.

అయితే నాలుగో టెస్టులోనే కాకుండా ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు సైతం మాక్స్ వెల్ దూరంగానే వుండనున్నారని సమాచారం. ఇంగ్లాండ్ లో అన్ని పిచ్ లు రమారమి పేస్ పిచ్ లు కావడంతో ఆయన అవసరం అంతగా వుండకపోవచ్చునని.. దీంతో అతని ఎంపిక అనుమానమేనని క్లార్క్ అన్నారు. ఒక స్పిన్ ఆల్ రౌండర్ కంటే కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కే స్మిత్ అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్నాడు. ఆసీస్ జట్టులో మ్యాక్స్ వెల్ కీలక ఆటగాడైనప్పటికీ, అతను ఆల్ రౌండర్ గా ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : glenn maxwell  michael clarke  steve smith  australia  dharmasala  Team india  cricket  

Other Articles