కెరీర్ బెస్ట్ ర్యాంకుకు కోహ్లీ.. అగ్రస్థానంలో టీమిండియా Kohli climbs to career-best third in Test rankings

Kohli vaults to career best no 3 spot in icc test rankings

india vs england, virat kohli, kohli, mohali test, ravichandran ashwin, ravindra jadeja, icc test rankings, icc rankings india, india test rankings, Parthiv Patel, mohammed shami, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

Indian skipper Virat Kohli vaulted to a career best third spot in the latest International Cricket Council (ICC) rankings for Test batsmen

కెరీర్ బెస్ట్ ర్యాంకుకు కోహ్లీ.. అగ్రస్థానంలో టీమిండియా

Posted: 11/30/2016 05:51 PM IST
Kohli vaults to career best no 3 spot in icc test rankings

టీమిండియా టెస్టు కెప్టెన్‌, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్‌ కోహ్లి తన కెరీర్ లోనే బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. అత్యుత్తమమైన అగ్రస్థానాన్ని అందుకోవడానికి కేవలం రెండు అడుగుల దూరంలో వున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో మరో రెండు టెస్టుల్లో అద్భుతంగా రాణించిన పక్షంలో కోహ్లీ నంబర్‌ వన్‌ మైలురాయి అందుకుంటాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు బ్యాట్సమన్‌ ర్యాంకుల్లో కోహ్లీ 833 రేటింగ్‌తో తృతీయ స్థానానికి చేరుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి 3వ ర్యాంకును తొలిసారి ద‌క్కించుకున్నాడు. న్యూజీలాండ్ తో సిరీస్ ముగిసిన తరువాత ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 15వ స్థానంలో నిలిచిన విరాట్.. మూడు టెస్టు మ్యాచులలో అడిన తరువాత ఏకంగా 15వ ర్యాంకు నుంచి 12 స్థానాలను ఎగబాకీ 3వ స్థానాన్ని అందుకున్నాడు. దీంతో కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యుత్త‌మ ర్యాంకు అందుకున్నాడు.

ఇంగ్లండ్‌ తో జరిగిన మూడు టెస్టుల్లో కోహ్లి 405 పరుగులు చేశాడు. జోయ్‌ రూట్‌, స్టీవెన్‌ స్మిత్‌ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ తో జరగనున్న మరో రెండు టెస్టు మ్యాచుల్లో కోహ్లి అద్భుతంగా రాణిస్తే నంబర్ వన్‌ ర్యాంకు దక్కించుకునే అవకాశముంది. ఇక టీమిండియా ఓపెనర్ చటేశ్వర్ పుజారా కూడా టాప్ అ0 బ్యాట్స్ మెన్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన 8వ ర్యాంకులో కొనసాగుతున్నాడు

ఆల్‌ రౌండర్ల ర్యాంకింగ్స్‌ లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మరోవైపు ఫీల్డింగ్ లో రాణించిన రవిచంద్రన్ అశ్విన్.. తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, రవీంద్ర జడేజా నాలుగో స్థానానికి ఎగబాకాడు. బౌలర్ల జాబితాలో మహ్మద్‌ షమి 21 నుంచి 19వ ర్యాంకుకు చేరుకున్నాడు. మొహాలి టెస్టులో 5 వికెట్లు పడగొట్టడంతో షమి ర్యాంకు మెరుగైంది. ఇక జట్టు విషయంలో టీమిండియా కూడా నెంబర్ వన్ స్థానంలో కోనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles