అశ్విన్ తలుచుకుంటే చాలూ.. మొహాలీ కూడా మనదే | Spinners Put India On Top in Mohali Test

Spinners put india on top in mohali test

India vs England, Day 3, Mohali Test, India Test Match, ravichandra Aswin, Ashwin spin, Ashwin England

Spinners Put India On Top in Mohali Test against England day 3.

నాలుగో రోజే ఫలితం తేలిపోతుందా?

Posted: 11/28/2016 05:01 PM IST
Spinners put india on top in mohali test

మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ హవాకొనసాగుతోంది. మూడో రోజు 274/6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు అశ్విన్ (72), రవీంద్ర జడేజా (90) ఊపిరిపోశారు. అశ్విన్ అవుటైనప్పటికీ జడేజాతో కలిసి జయంత్ యాదవ్ (55) ఆడిన ఇన్నింగ్స్ ఇంగ్లండ్ కష్టాలు పెంచింది. వీరు ముగ్గురూ రాణించడంతో టీమిండియా 417 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను రవిచంద్రన్ అశ్విన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అశ్విన్‌ సంధించిన బంతి వికెట్లను గిరాటేయడంతో కుక్ (12) పెవిలియన్ చేరాడు. అనంతరం మెయిన్ అలీ (5) కూడా అశ్విన్ ఉచ్చులో చిక్కాడు. తరువాత బెయిర్ స్టో (15)ను జయంత్ యాదవ్ అవుట్ చేశాడు. తరువాత వచ్చిన బెన్ స్టోక్స్ (15) ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో మూడోరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ 38 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది.

నిలదొక్కుకున్న రూట్ (29) ఆకట్టుకోగా, అతనికి జతగా బెట్టీ దిగాడు. టీమిండియా బౌలర్లలో మూడు వికెట్లతో అశ్విన్ రాణించగా, అతనికి జయంత్ యాదవ్ ఒక వికెట్ తీసి చక్కని సహకారమందించాడు. ఈ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు ఇంకా 56 పరుగులు వెనుకబడి ఉంది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో రేపు ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  Day 3  Mohali Test  Ashwin  

Other Articles