Team india beat australia by 9 wickets

India historic win vs Australia, MS Dhoni, Virat Kohli, Rohit sharma, Shikhar Dhawan, George Bailey, India beat Australia by 9 wickets

Creating history, team India today beat Australia by 9 wickets. Shikhar Dhawan gave a smashing start to India...

క్రికెట్ చరిత్రలో ఇండియా కొత్త రికార్డు

Posted: 10/17/2013 07:02 PM IST
Team india beat australia by 9 wickets

తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ రెండో వన్డేలో తన ప్రతాపాన్ని చూపింది. ఆస్ట్రేలియాతో ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న రాత్రి జైపూర్ లో జరిగిన రెండో వన్డేలో భారత క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని సాధించి కుర్రాళ్ల పవర్ ఏంటో చాటి చెప్పింది. మొన్నటి వరకు టి20ల మజాలో ఉన్న ప్రేక్షకులకు చాలా కాలం తరువాత ఫిప్టీ-50 ఓవర్ల మ్యాచ్ ను కూడా టి20ని తలపించేలా చేశారు. యువ బ్యాట్స్ మెన్స్ ధాటికి బంతి బలికాగ, బౌండరీ చిన్న బోయింది. అతి భారీ లక్ష్యాన్ని అవలోకగా చేధించి అధ్బుత విజయాన్ని సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 359 పరుగుల భారీ స్కోరు సాధించింది.

సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్న కెప్టెన్ జార్జి బెయిలీ (50 బంతుల్లో 92 నాటౌట్; 8 ఫోర్లు; 5 సిక్స్‌లు) మరోసారి రాణించగా... ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (53 బంతుల్లో 50; 7 ఫోర్లు; 1 సిక్స్), ఫిల్ హ్యూస్ (103 బంతుల్లో 83; 8 ఫోర్లు; 1 సిక్స్), వాట్సన్ (53 బంతుల్లో 59; 6 ఫోర్లు; 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 53; 7 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

ఇక మొదటి వన్డే తీరును చూసిన జనాలు ఇంత భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమే అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత యువ ఆటగాళ్ళు చిచ్చిర పిడుగుల్లా చెలరేగి పోయారు.  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ ధాటికి భారీ లక్ష్యం చిన్నబోయింది. రోహిత్, కోహ్లి సెంచరీలతో హోరెత్తించారు.. ఆసీస్ నిర్దేశించిన 360 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 6.3 ఓవర్లు మిగులుండగానే విజయాన్ని అందుకుంది. 43.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 362 పరుగులు చేసింది. ధావన్ 95 పరుగులతో మంచి శుభారంభాన్ని ఇవ్వగా, 52 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో కోహ్లీ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 16వ సెంచరీ. 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రోహిత్ 102 బంతుల్లో 11 ఫోర్లు, ౩ సిక్సర్లతో శతకం పూర్తి చేసిన రోహిత్ 141 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles