పెర్త్ టెస్టు: గెలుపు దిశగా సఫారీల అడుగులు South Africa make big strides towards victory

South africa make big strides towards victory

Australia, Australia vs South Africa, Cricket, Dale Steyn, Faf du Plessis, Kagiso Rabada, Mitchell Starc, South Africa, South Africa vs Australia, Steve Smith, Test cricket, Australia cricket, south africa cricket, cricket, cricket news, sports, sports news

South Africa victory was all but assured. It was a day of great South African entertainment, most notably fielding magic from Temba Bavuma and bowling brilliance from Kagiso Rabada.

పెర్త్ టెస్టు: గెలుపు దిశగా సఫారీల అడుగులు

Posted: 11/06/2016 05:18 PM IST
South africa make big strides towards victory

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పర్యాటక జట్టు చేతిలో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్  చేసిన సఫారీలు.. తొలి టెస్టులో కూడా విజయం వైపు పయనిస్తున్నారు. తొలి రెండు రోజులు గెలుపు ఇరు జట్ట మద్య దోబూచులాడినా.. మూడో రోజు నుంచి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు బాగా రాణించడంతో.. పటిష్ట స్థితిలో వుంది. మూడో రోజు ఆరు వికెట్లు కోల్పోయి 390 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గవ రోజున మరింతగా పుంజుకుంది. నాల్గవ రోజున ఫీలాండర్ 73, డికాక్ 64 రాణించడంతో దక్షిణాఫ్రికా 540 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

దక్షిణాఫ్రికా విసిరిన 539 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లు షాన్ మార్ష్(15),డేవిడ్ వార్నర్(35),స్టీవ్ స్మిత్(34), వోగ్స్(1)లు పెవిలియన్ చేరారు. దక్షిణాఫ్రికా పేసర్ రబడా  విజృంభించి మూడు వికెట్లు తీశాడు. ఉస్మాన్ ఖవాజా(58 బ్యాటింగ్), మిచెల్ మార్ష్(15 బ్యాటింగ్)క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సోమవారం చివరి రోజంతా ఆడాల్సి వుంది. అదే సమయంలో ఆసీస్ విజయానికి మరో 370 పరుగులు కావాల్సి ఉండగా,  సఫారీల విజయానికి ఆరు వికెట్లు అవసరం ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : perth test  australia vs south africa  south africa  australia  Cricket  

Other Articles