ఇంగ్లాండ్ సిరీస్ కు రోహఇత్ దూరం కావడం భాదే Feel sad for Rohit Sharma, says Anil Kumble

Feel sad for rohit sharma he was doing well says anil kumble

india vs england 2016, india vs england, england tour of india, england in india, england india cricket, anil kumble, india coach kumble, india team injuries, shikhar dhawan, kl rahul, rohit sharma, cricket

Team India's head coach Anil Kumble said he is disappointed with Rohit Sharma's untimely injury. He sustained an injury on his right upper quadriceps tendon, during the fifth odi match against New Zealand.

రోహిత్ సిరీస్ కు దూరం కావడం భాదగా వుంది

Posted: 11/06/2016 04:40 PM IST
Feel sad for rohit sharma he was doing well says anil kumble

పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో జరుగనున్న ఐదు టెస్టుల సీరీస్ లో భాగంగా ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో ఫామ్ లోకి వచ్చి బాగా రాణిస్తున్న ఓపెనర్ రోహిత్ శర్మ లేకపోవడం పట్ల టీమిండియా ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే అవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ తో సీరీస్ లో జట్టులో పలువురు ముఖ్యమైన ఆటగాళ్లు లేకపోవడం జట్టును కొద్దిగా వేధించే అంశమేనన్నారు. ఇదివరకు టెస్టులో బాగా రాణించిన వారు గాయాల కారణంగా మ్యాచ్‌లకు దూరమవ్వడం పట్ల అవేదన వ్యక్తం చేశారు.

ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ధావన్, విజయ్ వంటి ఆటగాళ్లు గాయాలతో సతమతమైతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ అనీల్ కుంబ్లే జట్టు పరిస్థితిపై మాట్లాడుతూ తన విచారాన్ని వ్యక్తపరిచారు. ఈసారి అనుకోని విధంగా ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెట్టాయని ఆయన చెప్పారు కోచ్ కుంబ్లే. ముఖ్యంగా బాగా ఆడుతున్న రోహిత్ శర్మ పరిస్థితికి తాను విచారిస్తున్నానని అన్నారు.

రోహిత్ శర్మ తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. వైజాగ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం రోహిత్ లండన్‌కు వెళ్లనున్నాడని బీసీసీఐ ప్రకటించింది. అవసరమైతే రోహిత్‌కు సర్జరీ కూడా జరిగే అవకాశముందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england 2016  anil kumble  rohit sharma  Team India  Cricket  

Other Articles