తొలిటెస్టుకు తొలగిన అడ్డంకులు.. బిసిసిఐకి స్వల్ప ఊరట Supreme Court Allows BCCI to Release Funds for Rajkot Test

Supreme court allows bcci to release funds for rajkot test

bcci, board of control for cricket in india, supreme court, bcci supreme court, bcci lodha panel, lodha panel, bcci vs lodha, bcci lodha england, india england, india england series, cricket, cricket news, sports, sports news

Supreme Court has allowed BCCI to incur expenses of Rs 58.66 lakhs in order to efficiently host the first Test of the series against England.

రాజ్ కోట్ కు లైన్ క్లియర్.. బిసిసిఐకి స్వల్ప ఊరట

Posted: 11/08/2016 06:17 PM IST
Supreme court allows bcci to release funds for rajkot test

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న సిరీస్ పై తుది వరకు కమ్ముకున్న నీలినీడలు ఎట్టకేలకు వైదోలగగా, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బిసిసిఐకి స్వల్ప ఊరట లభించింది. సుదీర్ఘ పర్యటన కోసం భారత్ లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి తమ ఖర్చులు తామే పెట్టుకోవాలని లేఖ రాయడంతో ఊహించని పరిణామాలు ఎదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్ నేపథ్యంలో టెస్టుకు ఎలాంటి విఘాతం కల్గకుండా అత్యున్నత న్యాయస్థానం చర్యలు తీసుకుంది.

రాజ్కోట్ వేదికగా రేపటి నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్కు లైన్ క్లియరైంది. ఈ టెస్టు నిర్వహించడానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో బీసీసీఐలో నెలకొన్న టెన్షన్ కు పుల్ స్టాప్ పడింది. నిధుల లేమితో మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితులను తెలుపుతూ తమ గోడును బిసిపిఐ సుప్రీంకోర్టుకు వెల్లబోసుకుంది. బీసీసీఐ స‌మ‌ర్పించిన‌ అఫిడవిట్ ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు ఈ విష‌యంలో సానుకూలంగా స్పందించింది. నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది.

వెంట‌నే రాజ్‌కోట్ టెస్టు మ్యాచుకు రూ. 58.66 ల‌క్షలు విడుద‌ల చేయాల‌ని బ్యాంకుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేప‌టి మ్యాచ్‌పై సందిగ్ధత తొల‌గింది. ముందుగా నిర్ణయించిన‌ షెడ్యూల్ ప్ర‌కార‌మే మొద‌టి టెస్టు మ్యాచు జ‌ర‌గ‌నుంది. కాగా, బిసిసిఐ పెద్దలు రాజ్ కోట్ వెళ్లేందుకు మాత్రం నిధులను సుప్రీం విడుదల చేయలేదు. దీంతో రేపటి మ్యాచ్ పై స్పల్ప ఊరట లభించినట్లైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles