టీమిండియా చేతిలో ఇంగ్లాండ్ వైట్ వాష్ తప్పదట Ganguly warns England of a whitewash against India

Ganguly warns england of a whitewash against india

India vs England, england, India, sourav ganguly, ind vs eng, eng vs ind, england vs india, England tour of India, England cricket, India cricket, cricket, cricket news, sports, sports news

Former skipper Sourav Ganguly cautioned England from getting whitewashed in the upcoming five-match Test series, starting 9 November at Rajkot

టీమిండియా చేతిలో ఇంగ్లాండ్ వైట్ వాష్ తప్పదు

Posted: 11/03/2016 06:47 PM IST
Ganguly warns england of a whitewash against india

టీమిండియాతో ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ లో ఇంగ్లాండ్ జటక్టు కూడా ఘోర పరాభవం తప్పదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హెచ్చరించాడు. టీమిండియా అటగాళ్ల ఫామ్ చూస్తుంటే పర్యాటక జట్టు ఇంగ్లాండ్ ను కూడా క్లీన్ స్వీప్ చేస్తారేమోనని అనిపిస్తుందని జోస్యం చెప్పాడు. భారత పర్యటన చేదు అనుభవంలా మిగిలిపోకుండా ఇంగ్లాండ్ జట్టు జాగ్రత్త పడాలని సూచించాడు. న్యూజిలాండ్ మాదిరే ఇంగ్లండ్ ను కూడా వైట్ వాష్ చేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపాడు.

మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లను ఉద్దేశించి ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాట్లాడుతూ, భారత పర్యటనలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్పిన్ దిగ్గజాలను చూసి కంగారు పడకూడదన్నాడు. జట్టులో అశ్విన్, జడేజా, మిశ్రా లాంటి స్పిన్ దిగ్గజాలు వున్నారన్న విషయాన్ని మర్చిపోవాలన్నారు. తమ ఆట తాము అడుతున్నాము అనుకుంటూ సహజ సిద్ధంగా ఆడాలని తమ సూచించాడు.

తమ జట్టులోనూ టాప్ స్పిన్నర్లు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాడు. బంగ్లాదేశ్ తో టెస్టులో అ దేశ స్పిన్నర్లు చూసి తడబాటుకు గురై.. వికెట్లను పారేసుకున్నట్లు భారత్ పర్యటనలో చేయకూడదని సూచించిన నేపథ్యంలో ఇవాళ గంగూటీ ఈ వ్యాఖ్యలు చేసి ఇంగ్లాండ్ అటగాళ్ల మనోధైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  england  India  sourav ganguly  cricket  

Other Articles