స్వదేశంలో ఈ నెల 9 నుంచి రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో తాము పర్యాటక జట్టు స్లెడ్జింగ్ కు ఏ మాత్రం స్పందించబోమని వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా అన్నాడు. వారి స్లెడ్జింగ్ కు తాము స్పందించిన పక్షంలో వారు దానినే అవకాశంగా తీసుకుని మరింతగా రెచ్చిపోయి భారత విజయాన్ని దెబ్బతీసే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సాహ మాట్లాడుతూ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు స్పష్టం చేశాడు.
తన రంజీ జట్టు బెంగాల్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కంటే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎంతో మెరుగ్గా ఉంటుందన్నాడు. బెంగాల్ జట్టుకు ఆడుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా గంభీరమైన వాతావరణం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ తరహా వాతావరణం తనకు అంతగా నచ్చదని సాహా చెప్పాడు. అదే సమయంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అందుకు భిన్నంగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నాడు.
ఇక విరాట్ కోహ్లి, ధోనిలపై సాహా ప్రశంసలు కురిపించాడు. ధోని, కోహ్లిల్లో ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాలని కోరిక అమితంగా ఉంటుందన్నాడు. దానికోసం తమ శాయశక్తులా పోరాడతారని సాహా కొనియాడాడు. విరాట్, ధోని కెప్టెన్సీ విషయాల్లో పెద్దగా తేడా లేకపోయినా, కొన్ని విషయాల్లో మాత్రం ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుందన్నాడు. ముఖ్యంగా ఆన్ ఫీల్డ్‌లో ధోని కూల్‌గా ఉండటంతో పాటు మితంగా మాట్లాడితే, కోహ్లి మాత్రం చాలా దూకుడుగా ఉంటాడని పేర్కొన్నాడు. తన భుజాలపై ఆవేశాన్ని ధరించి వచ్చినట్లు కోహ్లి కనబడతాడన్నాడు
అయితే ఒకసారి మ్యాచ్ ముగిసిపోయిందంటే కోహ్లి అంత ఫ్రెండ్లీగా మరొకరు ఉండరన్నాడు. ఒక రోజు ఆట ముగిసిపోయిన తరువాత కోహ్లిని చూస్తే ఇప్పటివరకూ ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తేనా ఇలా ఉన్నాడని అనిపిస్తుందన్నాడు. జట్టులోని ప్రతీ ఒక్కరితో చాలా సన్నిహితంగా కలిసిపోయే వ్యక్తిత్వం కోహ్లిదన్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత విరాట్ చాలా కూల్‌గా మాట్లాడుతూ కొన్ని సూచనలు చేస్తూ తన అనుభవాన్ని మాతో పంచుకుంటాడని సాహా అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more