సెడల్ వైపు మొగ్గుచూసిన క్రికెట్ అస్ట్రేలియా Aussie selectors locked in a civil warq

Cricket australia opt for siddle in first south africa test

Australia, Australia vs South Africa, Cricket, Dale Steyn, Faf du Plessis, Kagiso Rabada, Mitchell Starc, South Africa, South Africa vs Australia, Steve Smith, Test cricket, Australia cricket, south africa cricket, cricket, cricket news, sports, sports news

Australia have chosen the experience of Peter Siddle over the potential of the uncapped Joe Mennie as their third seamer for the opening Test against South Africa

సెడల్ వైపు మొగ్గుచూసిన క్రికెట్ అస్ట్రేలియా

Posted: 11/02/2016 06:14 PM IST
Cricket australia opt for siddle in first south africa test

అప్రతిహాత విజయాలతో విజయదు:ధుబి మ్రోగించిన అస్ట్రేలియ జట్టు ప్రస్తుతం వరుస పరాజయాలతో కుంగిపోతుంది. ఈ నేపథ్యంలో దక్షిణాప్రికాతో రేపటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ లలో మళ్లీ తమ సత్తా చాటాలంటే అనుభవజ్ఞులే కావాలని క్రికెట్ అస్ట్రేలియా భావిస్తుంది. ఇందుకోసం అనుభవజ్ఞుడైన పేసర్ ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఇవాళ అసీస్ కెప్టెన్ స్టీవ్ స్మీత్ ఈ మేరకు ప్రకటించిన జట్టు సభ్యుల వివరాలలో టెస్టు మ్యాచ్ లలో అరంగ్రేటం చేయాలని ఎదురుచూస్తున్న బోయ్ మెన్నీకి బదులు సిడిల్ వైపు మొగ్గుచూపింది.

తొలుత జోయ్ బెన్నీకి చాన్స్ కల్పిస్తు తుది జట్టును ప్రకటించగా, చివరకు సఫారీలతో మ్యాచ్ అరంభానికి ముందు మార్పులు చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా జట్టులోకి అనుభవజ్ఞుడైన పీటర్ సిడిల్ ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అరంగ్రేటం కోసం వేచిచూస్తున్న జోయ్ మెన్నీని, సీనియర్ బౌలర్ పీటర్ సిడిల్ లలో ఎవరికి జట్టులో స్థానం కల్పించాలా అని తెగ అలోచించిన క్రికెట్ అస్ట్రేలియా.. చివరకు అనుభవం ఉన్న సిడిల్ కు అవకాశం ఇచ్చింది.

ఇటీవల వరుస సిరీస్ ఓటములతో ఆత్మస్థైర్యం లోపించిన జట్టుకు అనుభవజ్ఞలు తొడైతే కాసింత బలం చేకూరుతుందని భావించిన క్రికెట్ అస్ట్రేలియా.. సిడిల్ ను స్థానం కల్పించింది. శ్రీలంకతో ప్రారంభమైన కంగారుల పరాజయం.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ను కూడా కోల్పోయింది. తొమ్మిది నెలల కిందట న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా గాయపడ్డ సిడిల్ ఫిట్ నెస్ సంపాదించి మళ్లీ రెడీ కావడంతో ఆయనకు స్తానం కల్పించింది.

సిడిల్ 61 టెస్టుల అడిన అనుభవం తమకు ఎంతగానో కలసి వస్తుందని అసీస్ కెప్టెన్ స్టీవ్ స్మీత్ పేర్కోన్నారు. ఆయనతో పాటు గాయాల నుంచి కోలుకున్న మిచెల్ స్టార్క్, హజెల్ వుడ్ తమ బెస్ట్ ఆప్షన్స్ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ కు కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. మరోవైపు వన్డేల్లో ఆసీస్ కు వరుస ఓటములను చూపించిన సఫారీలు.. టెస్టు సిరీస్ లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Steve Smith  Peter Siddle  Australia  South Africa  cricket  

Other Articles