భారత సుదీర్ఘ పర్యటనక వచ్చిన ఇంగ్లండ్ తో ఈ నెల 9 నుంచి రాజ్ కోట్ వేదికగా ప్రారంభం కానున్న తొలిటెస్టు నుంచి చెన్నైలో డిసెంబర్ 16న జరగనున్న ఐదవ టెస్టు వరకు టీమిండియా టెస్టు స్వాడ్ ను బిసిసిఐ ప్రకటించింది. అయితే ఈ సిరీస్ లో భారత్ కొందరు ప్రధాన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోలేదు. ఈ స్వాడ్ లో తొలిసారి అల్ రౌండర్ హార్థిక్ పాండ్య స్థానం సంపాదించగా, న్యూజీలాండ్ తో జరిగిన సిరీస్ లో గాయాలపాలైన శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ లతో పాటు రోహిత్ శర్మలకు స్థానం లభించలేదు.
న్యూజీలాండ్ తో సిరీస్ లో రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన గౌతమ్ గంభీర్ పై సెలక్షన్ కమిటీ నమ్మకం ఉంచింది. కివీస్ తో జరిగిన మూడో టెస్టులో ఆర్థశతకాన్ని నమోదు చేసిన గంభర్ కు స్తానం సుస్థిరం చేసింది. ప్రధాన ఆటగాళ్లు లేకపోవడంతో మురళీ విజయ్ కి మళ్లీ చాన్స్ ఇచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన హార్థిక్ పాండ్యాతో పాటు జయంత్ యాదవ్ కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం లభించింది.
ఇకపోతే చికన్ గున్యాతో భాదపడుతూ న్యూజీలాండ్ తో సిరీస్ కు దూరమైన ఇషాంత్ శర్మకు స్వాడ్ లో స్థానం లభించింది. ఆయనతో పాటు కివిస్ తో మూడో వన్డేలో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన జయంత్ యాదవ్ కు కూడా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో స్థానం లభించింది.
టెస్టు స్వాడ్ ఎంపికైన అటగాళ్లు వీళ్లే..
విరాట్ కోహ్లీ కెప్టెన్, రవిచంద్రన్ అశ్విన్, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మహమ్మద్ షమీ, చత్తీశ్వర్ పుజారా, అజింక్య రహానే, వృద్దిమాన్ సాహ, కరుణ నాయర్, మురళీ విజయ్, ఉమేష్ యాదవ్, హార్థిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్
ఐదు టెస్టుల షెడ్యూలు, వేదికలు ఇవే
తొలి టెస్టు : రాజ్ కోట్ నవంబర్ 9 నుంచి 13 వరకు
రెండో టెస్టు : విశాఖపట్నం నవంబర్ 17 నుంచి 21 వరకు
మూడో టెస్టు : మోహలీ నవంబర్ 26 నుంచి 30 వరకు
నాల్గవ టెస్టు : ముంబై డిసెంబర్ 8 నుంచి 12 వరకు
ఐదవ టెస్టు : చెన్నై డిసెంబర్ 16 నుంచి 20 వరకు
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more