ఇండోర్ టెస్టు: రాణించిన టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ Kohli slams 13th Test century takes India to 267/3 on Day 1

Kohli slams 13th test century takes india to 267 3 on day 1

india vs new zealand, india vs new zealand statistics, india vs nz stats, india new zealand stats, ajinkya rahane, ajinkya rahane india, india ajinkya rahane, rahane india, india rahane stats, rahane statistics, sports, cricket

Ajinkya Rahane and Virat Kohli have shared four century stand since they started playing Tests together.

ఇండోర్ టెస్టు: రాణించిన టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్

Posted: 10/08/2016 06:29 PM IST
Kohli slams 13th test century takes india to 267 3 on day 1

ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా పర్యటక జట్టు న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టీమిండియా అదిలోనే వికెట్లను కొల్పోయి కష్టాల్లో పడినా, అ తరువాత కోలుకుని నిదానంగా రాణించి మొత్తానికి పైచేయి సాధించింది. తొలి రోజు అట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి 267 పరుగులను సాధించింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఫస్ట్ డే ఆటను టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ముచ్చటగా మూడో టెస్టు కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న టీమిండియాకు అదిలోనూ కష్టాల ముంచెత్తాయి.

ఓపెనర్ మురళీ విజయ్ (10) పరుగుల వద్ద ఔట్ అయ్యి పెవీలియన్ బాట పట్టగా, రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత పున:ప్రవేశం చేసిన గౌతమ్ గంభీర్ మూడు ఫోర్లు, రెండు సిక్స్ లతో అకట్టుకున్నాడు, అంతలోనే ఎల్బీడబ్యూగా 29 పరుగల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు,  అనంతరం వచ్చిన డిపెండబుల్ ఛటేశ్వర్ పుజారా (41) నిలదొక్కుకుని కీలక సమయంలో అవుటయ్యాడు. దీంతో కేవలం 100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పీకలొత్తు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, డిపెండబుల్ అజింక్యా రహానే జతకలిసి జట్టును ఆదుకున్నారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ(191 బంతుల్లో 103: 10 ఫోర్లు) సాధించాడు. స్వదేశంలో 17 ఇన్నింగ్స్ ల తర్వాత కోహ్లీ శతక్కొట్టాడు. చివరగా 2013 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై చెన్నై టెస్టులో శతకం చేశాడు. మూడో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. దీంతో వరుసగా మూడో టెస్టులోనూ టీమిండియానే పైచేయి సాధించింది. కోహ్లీ, అజింక్యా రహానే(172 బంతుల్లో 79 నాటౌట్: 9 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్ కు అభేద్యమైన 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 37వ ఓవర్ నుంచి తొలి రోజు ఆట నిలిపివేసే వరకూ రహానే, కోహ్లీలు  కివీస్ బౌలర్లకు మరో అవకాశం ఇవ్వలేదు. వీరి అజేయ భాగస్వామ్యం (167)తో తొలిరోజు భారత్ పైచేయి సాధించింది. కివీస్ బౌలర్లలో పటేల్, బౌల్ట్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  test cricket  virat kohli  ajinkya rahane  india vs new zealand  indore  cricket  

Other Articles