India vs West Indies semifinal: India's faltering batsmen face their toughest test yet against rampaging West Indies

Team india openers show their batting skills now says kaif

ICC T20 World Cup, Indian Cricket, team india, opening pair, batting skills, Mohammad Kaif, Rohit Sharma, Yuvraj Singh, suresh raina, MS dhoni, india vs west indies, ind vs wi, wankhede stadium, mumbai, Virat Kohli, Ravi shastri, Cricket

Mohammad Kaif speaks about the poor form of the Indian batsmen and their chances against West Indies in the World T20 semifinal.

టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శనను ఇవ్వాలి..

Posted: 03/31/2016 05:41 PM IST
Team india openers show their batting skills now says kaif

ప్రపంచ కప్ టీ 20లో సెమిస్ చేరిన భారత జట్టు విజయాలను నమోదు చేసుకున్నప్పటికీ.. జట్టుగా మాత్రం స్థాయిని చేరుకోవడం లేదని ఇండియన్ మాజీ క్రికెటర్ మహమ్మధ్ కైప్ అభిప్రాయపడ్డారు. టీమిండియా పొటెన్షాలిటీ తనతో పాటు యావత్ భారతీయులకు తెలుసునని, అయితే ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శనను వారు ఇవ్వలేకపోయారన్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో పలువురు బ్యాట్స్ మెన్ ఆటతీరు చర్చనీయాంశంగా మారిందన్నారు.

దీనిని మారు తమ దరుదృఫ్టంగా పరిగణించి.. వదిలేస్తున్నారే తప్ప ఒకసారి కాకపోతే మరోసారైనా జట్టు విజయానికి తమ వంతు ప్రదర్శనను కనబర్చలేకపోతున్నారని విమర్శించారు. అయితే ఇదే సమయంలో మరో ఒకరో, ఇద్దరో బ్యాట్స్ మెన్లు అద్భుతంగా రాణించడంతో వారు తాత్కాలికంగా తప్పించుకోగలుగుతున్నారని కైఫ్ అన్నాడు. ప్రధానంగా టీమిండియా ఓపెనర్ల ద్వయం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ల బ్యాటింగ్ చూస్తుంటే అసలు వీళ్లకు బ్యాటింగ్ చేయడం గుర్తుందా అన్న అనుమానాలు అభిమానులలో తలెత్తుతున్నాయన్నాడు.

టి20 ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ మ్యాచ్‌లోనూ వీళ్లిద్దరూ అద్భుతంగా ఆడినట్లు చెప్పుకోడానికి లేదు. పైగా.. ఏమైనా అద్భుతమైన బాల్స్‌కు ఔటయ్యారా అంటే అదీ లేదు. దాదాపు ప్రతిసారీ చెత్తషాట్లకు ప్రయత్నించడం.. పెవిలియన్ బాట పడుతున్నారన్నాడు. పవర్ ప్లే ఆరు ఓవర్ లను సద్వినియోగం చేసుకుంటే టీమిండియా రాణించగలుగుతుందన్నాడు. ఈ సమయంలో అత్యధిక పరుగులు చేస్తే.. ఆ తరువాత వచ్చే బ్యాట్స్ మెన్ లు వాటికి మరిన్న పరుగులు జత చేయడం కష్టమైన పని కాదని అభిప్రాయపడ్డాడు. ఇక వన్ డౌన్ లో వచ్చే సురేష్ రైనా కూడా తన ఆటను మర్చిపోయాడని చురకలంటింబాడు.

మరోవైపు ఇదే విషయాన్ని టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా జట్టు సభ్యులందరికీ స్పష్టంగా చెప్పాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్.. ముఖ్యంగా ఓపెనర్లు తమ బ్యాట్లు ఝళిపించాలని గట్టిగానే చెప్పినట్లు సమాచారం. అవతల ఉన్నది చాలామంది గట్టి బ్యాట్స్‌మన్ ఉన్న వెస్టిండీస్ లాంటి జట్టు అయినా.. ఐపీఎల్ పుణ్యమాని వాళ్లలో చాలామంది ఆటతీరు తెలుసు కాబట్టి, మన ఓపెనర్లు ఇప్పటికైనా మళ్లీ తమ పాత బ్యాటింగ్ నైపుణ్యాలను గుర్తుకు తెచ్చుకుని.. చకచకా తలో హాఫ్ సెంచరీ చేస్తే భారత జట్టు అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc t20 world cup 2016  Mohammad Kaif  batting skills  rohith sharma  shikar dhawan  

Other Articles