Josh Hazlewood fined for dissent after appeal rejected

Australias josh hazlewood pleads guilty after abusing third umpire

Hazlewood pleads guilty to dissent in umpire row, Josh Hazlewood, australia, New zealand, test match, aus vs nzl

Australian fast bowler Josh Hazlewood pleaded guilty to dissent today following a profanity-laced confrontation with the umpires in the second Test against New Zealand.

థర్డ్ అంపైర్పై నోరుజారిన అసీస్ క్రికెటర్ హాజల్వుడ్

Posted: 02/23/2016 08:07 PM IST
Australias josh hazlewood pleads guilty after abusing third umpire

అంతర్జాతీయ క్రికెటర్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఓ క్రికెటర్ థర్డ్ అంపైర్ పై బూతు పురాణం అందుకోవడం.. తానేం మాట్లాడుతున్నానన్న సంగతి కూడా తెలియకుండా అనకూడని ఓ మాట కూడా అనేశాడు, ఇప్పుడదే అంతర్జాతీయ క్రికెట్ లో పెను సంచలనంగా మారింది.  ఏదో సాదాసీదా దేశానికి చెందిన క్రికెటర్ అయితే ఇప్పటికే రాద్దాంతం చేసే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ క్రికెటర్ పై చర్యలకు ఇంకా మీనమేశాలు లెక్కిస్తుంది. ఎందుకంటే సదరు క్రికెటర్ అస్ట్రేలియాకు చెందిన హాజల్ వుడ్ కావడం వల్లని విమర్శలు వినబడుతున్నాయి.

ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన అటు క్రికెట్ పెద్దల దగ్గర్నుంచీ  అభిమానుల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. నాల్గో రోజు ఆటలో భాగంగా మంగళవారం న్యూజిలాండ్ ఆటగాడు విలియమ్సన్ 88 పరుగుల వద్ద ఉండగా హాజల్ వుడ్ యార్కర్ ను సంధించాడు. ఆ బంతి విలియమ్సన్ లెగ్ ను తాకడం.. హాజల్ వుడ్ అప్పీల్ చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ అవుట్ ను ఫీల్డ్ అంపైర్ మార్టినెస్ తిరస్కరించాడు.

ఆపై వెంటనే కెప్టెన్ స్టీవ్ స్మిత్ టీవీ రిప్లే కోరాడు. ఆ నిర్ణయాన్ని సమీక్షించిన థర్డ్ అంపైర్ రిచర్డ్లింగ్వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో ఏకీభవిస్తూ విలియమ్సన్ ను నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో సహనం కోల్పోయిన హాజల్వుడ్ ఆ థర్డ్ అంపైర్....? అంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు.  హాజిల్ వుడ్ తిట్ల పురాణం వికెట్ల వద్దనున్న మైక్రోఫోన్ ద్వారా అక్కడ మ్యాచ్ ను వీక్షిస్తున్న టీవీ కామెంటేటర్లకు సైతం చేరింది. ఇది ఎంతమాత్రం క్షమించరాని చర్యగా టీవీ వ్యాఖ్యాత మార్క్ రిచర్డ్సన్ పేర్కొన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Josh Hazlewood  australia  New zealand  test match  aus vs nzl  

Other Articles