Asia Cup India marks first victory against Bangladesh

India beats bangladesh by 45 runs in asia cup

rohit sharma, ms dhoni, ms dhoni india, india ms dhoni, dhoni india, india dhoni, dhoni retirement, dhoni retire, when is dhoni retiring, when will dhoni retire, india cricket team, india cricket, bcci, world t20, asia cup,cricket, mahendra singh dhoni, asia cup t20, bangladesh, Iindia, cricket news, cricket, sports

Rohit Sharma's flamboyant innings of 83 runs not just took India out of trouble, but also helped win the Asia Cup opener against Bangladesh by a comprehensive 45 runs.

అసియాకప్ లో టీమిండియా శుభారంభం.. రాణించిన రోహిత్ శర్మ

Posted: 02/25/2016 01:57 PM IST
India beats bangladesh by 45 runs in asia cup

తొలిసారిగా టీ20 ఫార్మెట్ లో నిర్వహిస్తున్న ఆసియాకప్ లో టీమిండియా బోణీ కొట్టింది. బంగ్లాదేశ్ లోని మిర్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అతిధ్య జట్టును భారత్ చిత్తు చేసింది. భారత బౌలర్ల ముందు బంగ్లాదేశ్ బాట్స్ మెన్లు చేతులెత్తేశారు. దీంతో టీమిండియా 45 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి తన సత్తా మరోసారి చాటింది. టాస్ గెలచి ముందుగా ఫీల్డింగ్ కు దిగిన ధోని సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బంగ్లాదేశ్ ముందు 167 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించగా ఒక్కరిద్దరు మినహా ఎవరూ రాణించలేకపోవడంతో టీమిండియా 45 పరుగులతో విజయాన్ని అందుకుంది. టీమిండియా బౌలర్లలో  ఆశిష్ నెహ్రాకు మూడు వికెట్లు లభించగా, బూమ్రా, హార్దిక్ పాండ్యా, అశ్విన్లకు తలో వికెట్ దక్కింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి తనదైన దూకుడును ప్రదర్శించాడు. ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో రోహిత్ (83; 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియా ఆదిలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రోహిత్ తొలుత కుదురుగా ఆడినా... ఆ తరువాత తన బ్యాట్ ను ఝుళిపించి 83 పరుగులను సాధించాడు. అతనికి జతగా హార్దిక్ పాండ్యా(31;16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) నిలకడను ప్రదర్శించాడు. ఈ జోడి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ధోని అండ్ గ్యాంగ్ తేరుకుంది. దీంతో టీమిండియా 167 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి బంగ్లాదేశ్ ముందు ఉంచకల్గింది. టీమిండియా మిగతా ఆటగాళ్లలో శిఖర్ ధావన్(2), విరాట్ కోహ్లి(8), సురేష్ రైనా(13),  యువరాజ్ సింగ్(15)లు నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో ఆల్ అమీన్ మూడు వికెట్లు సాధించగా, మోర్తజా, మహ్మదుల్లా, షకిబుల్ హసన్ లు తలో వికెట్ తీశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  rohit sharma  dhoni  asia cup t20  bangladesh  Iindia  

Other Articles