తొలిసారి ట్వంటీ 20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియాకప్‌కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫయర్ యూఏఈలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. బుధవారం నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్ తొలిపోరులో ఆతిథ్య బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది. ఢాకాలోని షేరే బంగ్లా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య రేపు రాత్రి గం.7.00లకు మొదటి మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్ గా పోరుకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచీ టి20 ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతున్న భారత్.. ఇటీవల ట్వంటీ 20 ఫార్మాట్లో నంబర్ వన్ ర్యాంకును సైతం కైవసం చేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఆసియాకప్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియాలో మూడింటికి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు స్వదేశంలో శ్రీలంకపై 2-1తో సిరీస్ ను సాధించింది. ఆసియాకప్ ద్వారా పవన్ నేగి అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
మరోవైపు బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గత ఏడాది స్వదేశంలో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలపై వన్డే సిరీస్‌లు గెలిచిన ఆత్మవిశ్వాసంతో బంగ్లా బరిలోకి దిగుతోంది. బంగ్లా ప్రీమియర్ లీగ్ ద్వారా ఈ జట్టుకు కూడా కావలసినంత టి20 అనుభవం ఉంది. బంగ్లాతో జాగ్రత్తగా ఉండాలని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఇప్పటికే జట్టు సభ్యులను హెచ్చరించాడు. ఏమాత్రం అజాగ్రత్తతో ఉన్న తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ధోని సేనను అప్రమత్తం చేశాడు. దీంతో ఇరు జట్ల ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more