Australia's wins against India hold extra significance due to inexperience in side

Rohit s brilliance goes in vain again aussies take 2 0

cricket score, live score cricket, cricket live score, india vs australia live, live ind vs aus, ind vs aus live, live ind vs aus, india australia live, ind vs aus 2nd odi live score, ind vs australia 2nd odi live score, ind vs sa 2nd odi match live score, india australia 2nd odi live score, india australia perth, ind vs aus live waca

Australia have managed to upstage India with a team that consists quite a few internationally inexperienced players.

రికార్డు స్కోరు చేసినా.. రెండో వన్డేలోనూ ఓడిన దోని సేన

Posted: 01/15/2016 06:05 PM IST
Rohit s brilliance goes in vain again aussies take 2 0

హోంటీమ్ మరో విక్టరీని సొంతం చేసుకుంది. బ్రిస్బేన్ వన్డేలోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయిదు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 2-0 ఆధిక్యాన్ని సాధించింది. రెండో వన్డేలో ఆసీస్ ఏడు వికెట్లతో భారత్‌పై ఈజీగా గెలుపొందింది. 309 టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మరో ఓవరు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బెయిలీ 56 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 76 రన్స్ చేసి ఆసీస్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు రోహిత్ భారీ స్కోర్‌ను అందించాడు. వరుసగా రెండో వన్డేలోనూ రోహిత్ సెంచరీతో చెలరేగాడు. 127 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో రోహిత్ 124 రన్స్ చేశాడు. తొలి వన్డేలో అజేయంగా 171 రన్స్ చేసిన రోహిత్ రెండో వన్డేలోనూ దూకుడుగా ఆడాడు. కోహ్లీ, రహానేలు కూడా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సెంచరీ హీరో రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఛేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఆరన్ ఫించ్, షాన్ మార్ష్‌లు శరవేంగా పరుగులు రాబట్టారు. ప్రతి బౌలర్‌ను అలవోకగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 145 రన్స్ జోడించారు. తొలి వన్డేలోనూ పేలవ బోలింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చుకున్న భారత్ రెండో వన్డేలోనూ అదే తీరును ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించినా.. ధోనీ సేన ఓటమిని మాత్రం అడ్డుకోలేపోయింది.

స్కోరు వివరాలు:
ఆస్ట్రేలియా 309/3 (షాన్ మార్ష్ 71, ఫించ్ 71, స్మిత్ 46, బెయిల్ 76 నాటౌట్)
భారత్ 308/8 (రోహిత్ 124, రహానే 89, కోహ్లీ 59)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  Gabba  2nd one day  

Other Articles