DRS back in focus as Rohit Sharma given not out on 89 in Brisbane ODI

Good luck supported but bad luck backstabbed rohit sharma

cricket, rohit sharma, drs, team india, australia, joel paris, matthew wade, india tour of australia 2016, brisbane, india vs australia, india vs aus, ind vs aus, australia vs india, aus vs india, india vs australia highlights, india cricket team

The Decision Review System (DRS) was back in focus, again, as India opener Rohit Sharma had a big let-off during the 2nd ODI against Australia

అదృష్టం అదుకున్నా.. దురదృష్టం వెంటాడింది..

Posted: 01/15/2016 12:56 PM IST
Good luck supported but bad luck backstabbed rohit sharma

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మను అదృష్టం అదుకున్నా.. దురదృష్టం కూడా వెంటాడింది. రోహిత్ శర్మ తమకు కోరకరాని కోయ్యగా తయారుకావడంతో ఆయనను ఎప్పుడెప్పుడు ఔట్ చేసి పెవిలియన్ కు పంపుదామా అని ఎదురుచూసిన అస్ట్రేలియన్లకు బ్రిస్బేన్ లోని రెండో వన్డేలో ఆ అవకాశం రానే వచ్చింది. మంచి జోరుమీదున్న రోహిత్ శర్మను జియోల్ పారిస్ ఔట్ చేశాడు. పారిస్ విసిరిన బంతిని రోహిత్ శర్మ వికెట్ కీపర్ వేడ్ కు క్యాచ్ ఇచ్చాడు. అయితే ఏమాత్రం శబ్దం రాకపోవడంతో అస్ట్రేలియన్ అంఫైర్ మిక్ మార్టెల్ దానిని ఔట్ గా పరిగణించలేదు. దీంతో 89 పరుగల వద్ద పెవిలియన్ కు వెళ్లాల్సిన రోహిత్ ను ఆదృష్టం అదుకుంది.

కాగా రోహిత్ ను దురదృష్టం కూడా వదలకుండా వెంటాడింది. ఆయన సెంచరీ చేసి.. టీమిండియా స్కోరును పెంచే పనిలో నిమగ్నం కాగా రన్నర్ గా మరో ఎండ్ లో వున్న రోహిత్ ను దురదృష్టం ఔట్ చేసింది. అదేంటి అంటే.. ఫాల్కునర్ విసిరిన బంతిని బ్యాట్స్ మెన్ అజింక్య రహానే వేగంగా స్ట్రేయిట్ గా గాల్లోకి కొట్టాడు. అయితే దానిని పట్టుకునేందుకు యత్నించిన ఫాల్కునర్ తన వేళ్లను మాత్రమే తాకగలిగాడు. దీంతో కొంత వేగం తగ్గిన బంతి వేగంగా వెళ్లి వికెట్లకు తగలడం.. బెల్స్ కింద పడటం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాన్ని ఎంతమాత్రం జీర్ణంచుకోలేని రోహిత్ తన దురదృష్టాన్ని తిట్టుకున్నా.. ఆనక పెవిలియన్ కు చేరుకోక తప్పలేదు.

అయితే రోహిత్ శర్మ అవుట్ అయినా అంపైర్ మాత్రం అందుకు అనుగూణంగా నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో మళ్లీ డీఆర్ఎస్ పద్దతిని మళ్లీ అమల్లోకి తీసుకురావాలన్న ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం అస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో డీఆర్ఎస్ పద్దతిని అమల్లో లేదు. అది నుంచి ఈ పద్దతిని వ్యతిరేకిస్తున్న భారత్ కు గళం కలిపిన అస్ట్రేలియా.. ఇక దీనిపై పునరాలోచించుకునే అవకాశముందని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohit sharma  drs  team india  australia  joel paris  matthew wade  

Other Articles