Sri Lanka keeper Kusal Perera faces four-year doping ban

Sri lanka s kusal perera faces four year ban

sri lanka, sri lanka cricket, cricket sri lanka, kusal perera, perera, kusal perera sri lanka, sri lanka kusal perera, sri lanka cricket team, world cup, cricket world cup, cricket news, cricket

Sri Lanka's Kusal Perera faces four-year ban. Kusal Perera's urine sample was tested in Qatar after the ICC had originally found it contained banned substance.

శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరాపై నాలుగేళ్ల నిషేధం

Posted: 12/25/2015 08:16 PM IST
Sri lanka s kusal perera faces four year ban

అథ్లెటిక్స్ ప్రపంచాన్ని ఎక్కువగా డోపింగ్ ఉదంతాలు కుదిపేసిన వార్తలను తరుచు వింటుంటాం. అయితే అంతర్జ్తాతీయ స్థాయి క్రికెటర్ డోపింగ్ లో పట్టుబడి నాలుగేళ్ల పాటు నిషేధానికి గురైన ఘటన తాజాగా శ్రీలంక క్రికెట్ లో కలకలం సృష్టించింది.  శ్రీలంక జాతీయ క్రికెటర్ కుశాల్ పెరీరా డోపింగ్ కు పాల్పడినట్లు తాజాగా రుజువు కావడంతో అతనిపై నాలుగేళ్ల నిషేధం పడింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖతర్ లో నిర్వహించిన డోపింగ్ టెస్టులో అతని యూరిన్ శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చాయి.

ఈ విషయాన్ని ఐసీసీ తమ దృష్టికి తీసుకొచ్చినట్లు శ్రీలంక క్రీడాశాఖా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు.  కుశల్ పెరీరా  నిషేధిత  ద్రవ పదార్థాన్ని తీసుకున్నట్లు అతనికి నిర్వహించిన డోపింగ్ టెస్టు శాంపిల్స్ లో బహిర్గతమైనట్లు పేర్కొన్నారు. కాగా, దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని దయసిరి జయశేఖర్ పేర్కొన్నారు. ఇలా శ్రీలంక క్రికెట్ లో డోపింగ్ టెస్టులో పట్టుబడిన రెండో క్రికెటర్ పెరీరా. అంతకుముందు 2011లో ఉపల్ తరంగా ఈ తరహాలోనే పట్టుబడి మూడు నెలలు బహిష్కరణకు గురయ్యాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Lanka  Kusal Perera  four-year ban  banned substance.  

Other Articles