Money Game: New franchises face big losses in cash-rich IPL

New ipl teams facing big losses

IPL, Indian Premier League, BCCI,Chennai Super Kings, CSK, rajasthan royals, New Rising, Sanjiv Goenka, Intex Technologies, Pune, Rajkot, Reverse bidding, cricket news

the two new Indian Premier League franchises that won the bids on December 8 stand to lose of anywhere between Rs 100 to Rs 120 crore each in the next two years.

ఐపీఎల్ లో కొత్తగా వచ్చిన జట్లకు షాక్.. నష్టాలు బారెడు.. లాభాలు మూరెడు

Posted: 12/14/2015 06:53 PM IST
New ipl teams facing big losses

ఐపీఎల్ లోకి కొత్తగా ప్రవేశించి రివర్స్ బిడ్డింగ్ లో స్థానం దక్కించుకుని సంతోషంతో సంబరపడుతున్న కొత్త జట్లకు ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవడం లేదు. రానున్న రెండు సంవత్సరాల్లో వందల కోట్ల రూపాయల నష్టాలను సదరు రెండు నూతన జట్లు భరించాల్సిన పరిస్థితులు అలుముకున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై సస్పెండయిన ఐపీఎల్ టీమ్ లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ స్థానంలో రివర్స్ బిడ్డింగ్ విధానంలో ఎంపికైన కొత్త ఫ్రాంచైజీలకు ఆదిలోనే భారీ నష్టాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. రాజ్ కోట్, పుణెలు కొత్త ఫ్రాంచైజీలను దక్కించుకున్న ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటెక్స్ సంస్థ, కోల్ కతా వ్యాపారి సంజీవ్ గోయంకాలు వచ్చే రెండేళ్లలో రూ. 100 కోట్ల నుంచి రూ. 120 కోట్ల వరకూ నష్టపోనున్నారని నిపుణులు లెక్కగడుతున్నారు. మొత్తంగా ఈ రెండు జట్టు రూ. 240 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఏదైనా ఐపీఎల్ టీం వార్షిక ఖర్చు రూ. 95 కోట్ల నుంచి రూ. 100 కోట్లను మించరాదు. ఇక వారికి వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తే... స్పాన్సర్ షిప్ లు రూ. 22 కోట్లను మించరాదు. పుణెలో క్రీడాభిమానుల నుంచి టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం (7 మ్యాచ్ లకు స్టేడియం పూర్తిగా నిండితే రూ. 21 కోట్లు (పుణెలో), రూ. 16 కోట్లు (రాజ్ కోట్ లో) వస్తుంది. ఇక ఆహారం, శీతల పానీయాలు తదితరాల అమ్మకం ద్వారా మరో రూ. 50 లక్షల వరకూ ఆదాయం రావచ్చని అంచనా. మొత్తం ఆదాయం కలిపినా పుణె ఫ్రాంచైజీకి 43.5 కోట్లు, రాజ్ కోట్ ఫ్రాంచైజీకి రూ. 38.5 కోట్లను మించే అవకాశాలు కనిపించడం లేదు. దీనికితోడు ఐపీఎల్ సెంట్రల్ రెవెన్యూ నుంచి ఈ టీములకు ఒక్క రూపాయి కూడా దక్కదు. అంటే, ఈ ఫ్రాంచైజీల యాజమాన్యం ఒక్కో ఐపీఎల్ సీజనులో రూ. 50 కోట్ల నుంచి రూ. 55 కోట్ల వరకూ నష్టాన్ని భరించాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL New Rising  Sanjiv Goenka  Intex Technologies  Pune  Rajkot  

Other Articles