Sri Lanka crawl past follow-on target against NZ

New zealand 171 1 at stumps on day 3

sri lanka new zealand, kane williamson, kane williamson new zealand, new zealand sri lanka, slvnz, nzvsl, sri lanka new zealand tests, cricket news, cricket

By the time Day 3 ended, Sri Lanka were trailing the home team by 308 runs.

భారీ అధిక్యం దిశగా కివీస్.. శ్రమిస్తున్న లంక

Posted: 12/12/2015 06:01 PM IST
New zealand 171 1 at stumps on day 3

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ రెండో ఇన్నింగ్స్ లో  వికెట్ నష్టానికి 171 పరుగులు చేసి ఓవరాల్ గా 308 పరుగుల ఆధిక్యం సాధించింది. శనివారం 197/4 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన శ్రీలంక మరో 94 పరుగులు మాత్రమే చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది.

శ్రీలంక ఆటగాళ్లలో దిమురుత్ కరుణరత్నే(84), చండీమాల్(83)లు రాణించారు. కాగా, మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో శ్రీలంక 117.1 ఓవర్లలో 294 పరుగులకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో సౌతీ, వాగ్నర్ లకు తలో మూడు వికెట్లు లభించాయి. కాగా, సాంత్నార్, బౌల్ట్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కివీస్ కు ఓపెనర్లు గప్తిల్ (46) , లాథమ్(72బ్యాటింగ్)లు శుభారంభాన్ని అందించారు. జట్టు స్కోరు 79 పరుగుల వద్ద గప్తిల్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరినా.. ఆ తరువాత లాథమ్ కు జతకలిసిన విలియమ్సన్ (48 బ్యాటింగ్) మరోసారి రాణించి ఆట ముగిసే సమయానికి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : New Zealand  srilanka  first test  

Other Articles