India v/s South Africa 4th Test Day 3: Kohli, Rahane take India's lead past 400-run mark at stumps

Kotla test day 3 kohli rahane fifties give india big lead

India vs south africa,Live Streaming Information,virat kohli,ajinkya rahane,4th test,Watch live,India vs south africa live score,Ind vs SA,4th test live,Day 3 live score,Ind vs sa live

The match however, is firmly in India's hold already. They are 213 runs ahead on the first innings and will begin their second innings this morning.

భారీ అధిక్యం దిశగా టీమిండియా.. కోహ్లీ, రహానే అర్థశతకాలు..

Posted: 12/05/2015 05:53 PM IST
Kotla test day 3 kohli rahane fifties give india big lead

దక్షిణాఫ్రికాతో ఢిల్లీ వేదికగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న చివరిదైన నాల్గవ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. శనివారం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా 81.0 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో విరాట్ సేన మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్ గా 403 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (83 బ్యాటింగ్) అజింక్యా రహానే(52 బ్యాటింగ్)లు మరోసారి అర్థశతకాలతో రాణించిడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. టీమిండియా  57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి తడబడిన సమయంలో విరాట్-రహానే జోడి ఆదుకుంది.  ఈ జోడి అజేయంగా 133 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్టస్థితికి చేర్చారు.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే ఎనిమిది పరుగులకే మురళీ విజయ్, రోహిత్ శర్మల రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత శిఖర్-పూజారాల జోడి మరమ్మత్తులు చేపట్టింది. కాగా, 45 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఈ జోడి లంచ్ తరువాత నాలుగు పరుగుల వ్యవధిలో నిష్క్రమించడంతో టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. అప్పడు క్రీజ్ లోకి అడుగుపెట్టిన కెప్టెన్ విరాట్ , రహానేలు దాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో తిరిగి టీమిండియా గాడిలో పడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్ మూడు వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహీర్ కు ఒక వికెట్ దక్కింది.  తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 213 అధిక్యత లభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  south africa  ferozshah kotla stadium  delhi  

Other Articles