Amla, De Villiers bat as slow as possible, Proteas end penultimate day on 72-2

Kotla test day 3 kohli rahane fifties give india big lead

India vs south africa,Live Streaming Information,virat kohli,ajinkya rahane,4th test,Watch live,India vs south africa live score,Ind vs SA,4th test live,Day 3 live score,Ind vs sa live

India are in a formidable position at 190/4 with a lead of 403. Amla, De Villiers bat as slow as possible, Proteas end penultimate day on 72-2

మిగిలింది ఒక్కరోజే.. కావాల్సింది 8 వికెట్లు.. స్పిన్ మంత్రం ఫలించేనా.

Posted: 12/06/2015 05:58 PM IST
Kotla test day 3 kohli rahane fifties give india big lead

దక్షిణాఫ్రికాతో ఢిల్లీ వేదికగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న చివరిదైన నాల్గవ టెస్టులో సఫారీలు స్కోరు బోర్డును పరుగెత్తించడం మాని, వికెట్లు కాపాడుకోవడం పై దృష్టి సారించారు. టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయకుండా నిరోధించుకోవాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా.. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో తెగ కష్టపడుతున్నారు. టీమిండియా విసిరిన భారీ విజయలక్ష్యాన్నిచూసి భయపడ్డారో?లేక అనవసర రిస్క్ ఎందుకులే అనుకున్నారో కానీ సఫారీలు నిలకడగా ఆడుతున్నారు. దీంతో నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి 72.0 ఓవర్లలో సఫారీలు రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 72 పరుగులు చేశారు.

నాల్గో టెస్టులో 481 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన సఫారీలు డ్రా కోసం ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. సఫారీలు ఆదిలో ఎల్గర్(4) వికెట్ కోల్పోయి తడబడినట్లు కనిపించినా.. ఆ తరువాత హషీమ్ ఆమ్లా, భావుమా జోడి ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో కుదుటపడింది.  అయితే టీ విరామం తరువాత కొద్ది సేపటికి భావుమా(34) పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో అప్పటికే క్రీజ్ లో పాతుకుపోయిన ఆమ్లాకు ఏబీ డివిలియర్స్ జత కలిశాడు.

వీరి జోడి టీమిండియా బౌలర్లకు పరీక్షగా నిలిచింది. ఈ జోడిని విడగొట్టడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పదే పదే బౌలర్లను  మార్చినా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆమ్లా(23 బ్యాటింగ్;207బంతుల్లో 3 ఫోర్లు), డివిలియర్స్(11 బ్యాటింగ్; 91 బంతుల్లో 1 ఫోర్) సుదీర్ఘంగా క్రీజ్ లో నిలబడటంతో దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. దక్షిణాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు రవి చంద్రన్ అశ్విన్ ఖాతాలోనే చేరాయి.

అంతకుముందు 190/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా 100.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. ఈ రోజు ఆటలో విరాట్ కోహ్లి(88) సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినా.. అజింక్యా రహానే మరో శతకాన్ని సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి సఫారీలకు చుక్కలు చూపించిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తరహాలో బ్యాటింగ్ చేసి మరో సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే సెంచరీ చేసిన పిదప టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇంకా సోమవారం ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో.. టీమిండియా విజయానికి 8 వికెట్లు అవసరం. ఫలితం ఎలా వుంటుందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  south africa  ferozshah kotla stadium  delhi  

Other Articles