Team India won fourth test match with south africa

Team india won fourth test match with south africa

live cricket score, live score cricket, cricket live score, india vs south africa live, live ind vs sa, ind vs sa live, live ind vs sa, india south africa live, ind vs sa 4th test live score, ind vs south africa 4th test live score, ind vs sa 4th test match live score, india south africa 4th test live score, india south africa 4th test live score

Team India won fourth test match with south africa Ravindra Jadeja plotted South Africa's downfall with a five-wicket haul after Ajinkya Rahane's brilliant century as India gained complete control of the fourth cricket Test by taking a commanding 213-run lead on the second day in Delhi on Friday.

నాలుగో టెస్ట్ కూడా మనదే.. సౌతాఫ్రికా మరో‘స్వారి’

Posted: 12/04/2015 06:45 PM IST
Team india won fourth test match with south africa

సౌతాఫ్రికా ఆశలకు ఇండియన్ క్రికెటర్లు కల్లెం వేశారు. వరుస అపజయాలతో వెనుకబడిన సౌతాఫ్రికా నాలుగో టెస్టులో విజయం సాధించి కనీసం పరువు నిలుపుదామని అనుకున్న సౌతాఫ్రికా క్రికెటర్లకు చుక్కలు చూపించారు ఇండియన్ ప్లేయర్స్. అద్భుతమైన బౌలింగ్ తో మన బౌలర్లు ప్రత్యర్థి టీంకు చమటలు పట్టించారు. మొదటి టెస్ట్ నుండి ఎంత దూకుడుగా ఆడిందో అదే దూకుడుతో నాలుగో టెస్ట్ లో కూడా టీమిండియా విక్టరీని నమోదు చేసింది. ఫిరోజ్ షా స్టేడియంలో సౌతాఫ్రికా బ్యాట్స్ మన్స్ కు మన బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ భారత బౌలర్ల ధాటికి వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 121 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం లభించింది.

మొదటి మూడు టెస్టుల్లో స్పిన్నర్లు హవా చాటినా.. ఈ టెస్టులో స్పిన్నర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా రాణించారు. రవింద్ర జడేజా టెస్టుల్లో మరోసారి అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఉమేశ్ యాదవ్, ఇశాంత్ శర్మలు కూడా వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లు కంగారుపడ్డారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలిర్స్ ఒక్కడే అత్యధికంగా 42 రన్స్ చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే సెంచరీతో ఆకట్టుకున్నాడు. రహానే 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 127 రన్స్ చేశాడు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ హాఫ్ సెంచరీతో రహానేకు అండగా నిలిచాడు. అశ్విన్ 56 రన్స్ చేశాడు.మొత్తంగా టీమిండియా నాలుగో టెస్ట్ లో కూడా తన విజయ దుందుభిని కొనసాగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles