You can never trouble South African batsmen with that pace, says Sunil Gavaskar

Dhoni wasn t flexible enough in handling bowlers gavaskar

india south africa, south africa india, indvsa, savind, india vs south africa odi series, indvssa, savsind, sunil gavaskar, Mahendra Singh Dhoni, india, south africa, cricket news, cricket

Sunil Gavaskar said bowling is a massive cause of concern for the Indian team.

బౌలర్లను వినియోగించడంలో ధోని విఫలం

Posted: 10/26/2015 09:17 PM IST
Dhoni wasn t flexible enough in handling bowlers gavaskar

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఘోర ఓటమికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముఖ్యకారణమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ధోనితో పాటుగా ఇండియన్ బౌలర్లు కూడా ఈ మ్యాచ్ ఓటమికి కారణమని ఆయన చెప్పుకోచ్చారు. బౌలర్లను సద్వినియోగం పర్చుకోవడంలో ధోని విఫలం కావడమే ప్రధాన కారణమని అన్నారు. సఫారీలు చెలరేగి ఆడుతున్నప్పుడు బౌలర్లను పదేపదే మార్చకుండా ధోని కఠినంగా వ్యవహరించాడని విమర్శించాడు.

'టీమిండియా బౌలింగ్ లో ఉన్న సౌలభ్యాన్ని ధోని ఉపయోగించుకోలేదని పేర్కోన్నారు.. మొదట్లో బౌలింగ్ ను కొంతమేర మార్చినా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత బౌలింగ్ లో ఉన్న అవకాశాలను ధోని సరైన రీతిలో ఉపయోగించుకోలేదని, దీంతోనే దక్షిణాఫ్రికా మరింత చెలరేగిపోవడానికి కారణం' అని గవాస్కర్ పేర్కొన్నాడు. పనిలో  పనిగా భారత్ బౌలర్లపై కూడా ఆయన రుసరుసలాడారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బంతులను విధ్వంసం చేసి బౌండరీలు దాటిస్తుంటే.. మనం బౌలర్లు అలోచించకుండా బంతులు విసరడం కూడా ఓటమికి కారణమైందని గవాస్కర్ అన్నారు. ఐదు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunil gavaskar  Mahendra Singh Dhoni  india  south africa  

Other Articles