our team doesnt look settled says mahendra singh dhoni

India does not look to be a settled team ms dhoni

ms dhoni, ms dhoni india south africa, south africa vs india, ms dhoni india runs, south africa vs india, cricket news, cricket

MS Dhoni said that bowlers' performance was so bad that he won't count it as bad.

వన్డే క్రికెట్ లో ఇండియన్ టీమ్ ఇంకా సెట్ కాలేదు..

Posted: 10/26/2015 09:57 PM IST
India does not look to be a settled team ms dhoni

సఫారీలతో జరిగిన వన్డే సిరీస్ లో అందునా చివరి వన్డే మ్యాచ్ లో భారీ స్కోరుతో ఓటమి పాలైన నేపత్యంలో వస్తున్న విమర్శలపై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పందించాడు. వన్డే  క్రికెట్ లో తమ జట్టు ఇంకా పూర్తి స్థాయిలో  సెట్ కాలేదని ఆయన స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఘోర పరాజయన్ని మూటగట్టుకోవడంపై మాట్లాడిన ధోని.. అటు బ్యాటింగ్ తో పాటు, ఇటు బౌలింగ్ లోనూ జట్టు పూర్తిగా కుదురుకోలేకపోవడం వల్లే ఓటమి చెందామన్నాడు. 'జట్టులో అస్థిరత ఎక్కువగా కనబడుతుంది. భారత క్రికెటర్లలో ప్రతిభకు కొదవ లేకపోయినా, వారి నిలకడగా రాణించకపోవడమే వైఫల్యాలు కారణం. దీనిపై నిశితంగా దృష్టి పెట్టాల్సింది ఉంది' అని ధోని పేర్కొన్నాడు.
 
మ్యాచ్ డిసైడర్ గా పేరున్న ధోని మరోసారి విఫలం చెందడంపై ఏమి చెబుతారనే ప్రశ్నపై స్పందిస్తూ.. అసలు చివరి వన్డే మ్యాచ్ లో ఏం జరిగిందనేది దానిపై  దయచేసి అడగకండి. స్కోరు బోర్డుపై దాదాపు 450 పరుగులు ఉన్నప్పుడు కూడా ధోని ఏం చేశాడు అని అడుతున్నారా (నవ్వుతూ) అంటు చమత్కరించాడు. దక్షిణాఫ్రికా చేసిన స్కోరును ఛేదించడం కష్టసాధ్యమని తెలిపాడు.  దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 20 నుంచి 25 ఓవర్ల మధ్య కొంత మేర తమ అధీనంలోనే ఉందని..  తరువాత పరిస్థితులు అనుకూలించకపోవడంతో మ్యాచ్ పై పట్టుజారిందని ధోని తెలియజేశాడు. సఫారీలు బ్యాటింగ్ అద్భుతమంటూ మిస్టర్ కూల్ ప్రశంసల వర్షం కురిపించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  india  south africa  

Other Articles