enjoyed bowling to dhoni at kanpur says rabada

Kagiso rabada admits of enjoying bowling against ms dhoni in 1st odi at kanpur

gandhi-mandela series 2015,india,india vs south africa,india vs south africa 2015,kagiso rabada,ms dhoni,south africa,south africa tour of india 2015,south africa vs india,south africa vs india 2015

South Africa fast bowler Kagiso Rabada termed his one-on-one battle with Indian skipper Mahendra Singh Dhoni in the of opening contest in Kanpur.

ఆ ఓవర్ ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..

Posted: 10/26/2015 08:53 PM IST
Kagiso rabada admits of enjoying bowling against ms dhoni in 1st odi at kanpur

భారత్ తో జరిగిన తొలి వన్డే చివరి ఓవర్ ను జీవితంలో మర్చిపోలేనని సౌతాఫ్రికా సీమర్ రబడా తెలిపాడు. హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయానికి చేరువైన దశలో కెప్టెన్ డివిలియర్స్ తనపై నమ్మకంతో బంతిని అందించాడని, ఆ నమ్మకాన్ని నిలబెట్టగలిగినందుకు తనకు ఎంతో తృప్తి కలిగిందని రబడా చెప్పాడు. అప్పటికి టీమిండియా విజయానికి 11 పరుగులు కావాల్సి వుంది. క్రీజులో భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ప్రపంచంలో మేటి ఫినిషర్ గా ధోనీకి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి చెప్పుకోచ్చాడు.

చిన్నప్పటి నుంచి ధోనీ ఆటతీరును చూస్తూ పెరిగిన తాను అతనికే బౌలింగ్ చేయాల్సి రావడంతో ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యానన్నాడు. అయితే అద్భుతమైన బంతులతో అతను పరుగులు సాధించకుండా చూడడమే తన లక్ష్యమని భావించానని చెప్పాడు. కఠినమైన బంతులతో పరుగులను నియంత్రించిన తనకు బోనస్ గా ధోనీ వికెట్ కూడా లభించిందని రబడా సంతోషం వ్యక్తం చేశాడు. భారత్ లో భారత్ ను ఓడించడం ఎవరికైనా ఆనందదాయకమైన విషయమేనని చెప్పాడు. ఏమైనా, ఈ సిరీస్ లో ఆ ఓవర్ ను మాత్రం జీవితంలో మర్చిపోనని రబడా తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rabada  Mahendra Singh Dhoni  south africa  

Other Articles