5th ODI: South Africa's 438 wins them maiden ODI series in India

5th odi sa create history register maiden series win on india

India vs south africa,India vs South Africa 5th ODI Players,India vs South Africa 5th ODI,India vs South Africa 5th ODI key players,Players to watch out for in 5th ODI,India vs South Africa 5th ODI teams,India vs South Africa 5th ODI Rohit Sharma,Rohit Sharma,MS Dhoni,Virat Kohli,AB de Villiers,Mumbai series decider 5th ODI, Gandhi-Mandela Series 2015 India India vs South Africa India vs South Africa 2015 South Africa South Africa tour of India 2015 South Africa vs India South Africa vs India 2015

India succumbed to a 214-run defeat under the pressure of chasing the record-breaking 438 SA racked up - thanks to centuries from De Villiers, Du Plessis and De Kock.

సఫారీల వశమైన తొలి వన్డే సిరీస్.. ధోనిసేన దారుణ ఓటమి

Posted: 10/25/2015 10:00 PM IST
5th odi sa create history register maiden series win on india

టీమిండియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా తమ వశం చేసుకుంది. ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో సెంచరీల మోతతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా సగర్వంగా ట్రోఫీని అందుకుంది. ఆదివారం జరిగిన చివరి డే అండ్ నైట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 214 పరుగుల తేడాతో  ఘన విజయాన్ని సాధించింది. దీంతో  వన్డే సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-2 తో కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుని 439 పరుగుల లక్ష్యాన్ని టీమిండియాకు నిర్దేశించింది.  భారీ పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా 36 ఓవర్లలో 224 పరుగులకే చాపచుట్టేసింది.  టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధవన్(60), అజింక్యా రహానే(87) లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. విరాట్ కోహ్లి(7),  సురేష్ రైనా(12), మహేంద్ర సింగ్ ధోని (27 ), అక్షర్ పటేల్ (5) లు స్వల్ప పరుగులకే పెవిలియన్ కు చేరడంతో ధోని సేస ఘోర పరాభవాన్ని ఎదుర్కోంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, స్టెయిన్ కు మూడు, ఇమ్రాన్ తాహీర్ లకు రెండు వికెట్లు లభించాయి.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాప్రికా బ్యాట్స్ మెన్లు శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్ డీ కాక్,  డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లు దూకుడుగా ఆడి శతకాలతో పరుగుల వరద పారించారు.  ఓపెనర్ డీ కాక్,  డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లు దూకుడుగా ఆడి శతకాలతో పరుగుల వరద పారించారు.  డీ కాక్(109; 87 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్),  డు ప్లెసిస్(133;115 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు), డివిలియర్స్(119;6 బంతుల్లో 3 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీల నమోదు చేశారు

దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీల చేసిన అరుదైన రికార్డును దక్షిణాఫ్రికా రెండోసారి తనఖాతాలో వేసుకుంది.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఆదినుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(23) తొలి వికెట్ ను కోల్పోయిన అనంతరం డీ కాక్ తో కలిసిన డు ప్లెసిస్ దాటి బ్యాటింగ్ చేశాడు. వారిద్దరూ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడి రెండో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీనికి తోడు ధోని సేన పేలవమైన ఫీల్డింగ్ కూడా సఫారీల పరుగులు సునామీకి దోహదపడింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Ind vs SA  mumbai  South Africa  cricket  India vs South Africa 5th ODI  

Other Articles