harbhajan singh not selected for india team against south africa test matches and srinath aravind replaced umesh

Harbhajan singh not selected for india team against south africa test matches

harbhajan singh, umesh yadav, india vs south africa, india cricket team members, india team members, harbhajan singh controversies, srinath aravind

harbhajan singh not selected for india team against south africa test matches : harbhajan singh not selected for india team against south africa test matches and srinath aravind replaced umesh for last two onedays.

భజ్జీకి నో ఛాన్స్.. ఉమేష్ ని తీసేశారు..

Posted: 10/19/2015 04:26 PM IST
Harbhajan singh not selected for india team against south africa test matches

ఎన్నో సంవత్సరాలు కష్టపడి తిరిగి టీమిండియాలో చోటు సంపాదించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు మరోసారి పరాభావం ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి 2 టెస్టుల్లో అతనికి స్థానం దక్కుతుందని భావించాడు కానీ.. అలా జరగలేదు. అతని స్థానంలో జడేజాని ఎంపిక చేశారు. గతంలో భజ్జీకి ఇచ్చిన అవకాశాల్లో తమ ప్రతిభ అంతగా నిరూపించుకోలేకపోయిన నేపథ్యంలో.. ఈసారి దక్షిణాఫ్రికాతో ఆడేందుకు అవకాశం కల్పించలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. భజ్జీకి అవకాశం దక్కకపోవడంతో అతడు కాస్త నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. మరి.. ఇతని స్థానంలో చోటు సంపాదించుకున్న జడేజా తన సత్తా చాటుకుంటాడా..? లేదా అన్నది వేచి చూడాల్సిందే!

మరోవైపు.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమిపాలు కావడంతో జట్టులో మార్పులు చేశారు. సౌతాఫ్రికాతో జరగనున్న చివరి 2 వన్డేల్లో ఉమేష్ యాదవ్ ని తొలగించి, అతని స్థానంలో శ్రీనాథ్ అరవింద్ కు అవకాశం కల్పించారు. తొలి మూడు వన్డేల్లో ఉమేష్ తన ప్రతిభను చాటుకోకపోవడంతో సెలక్టర్లు అతనిని తొలగించేసి, శ్రీనాథ్ కు అవకాశం కల్పించారు. మరి.. ఇతని రాకతో టీమిండియా జట్టు పటిష్టంగా మారుతుందా..? అతని తన ప్రతిభను నిరూపించుకోగలడా..? అని తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే! ఈ క్రమంలోనే సెలక్టర్లు టెస్టు జట్టు వివరాలను వెల్లడించింది.
భారత టెస్టు జట్టు వివరాలు :
కోహ్లి(కెప్టెన్), విజయ్, ధావన్, పుజారా, రహానె, రోహిత్ శర్మ, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, భువనేశ్వర్, ఉమేష్, రాహుల్, బిన్నీ, ఆరోన్, ఇషాంత్

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harbhajan singh  srinath aravind  umesh yadav  

Other Articles