indian captain mahendra singh dhoni given clarification on third odi lost against south africa in rajkot ground | south africa vs india

Mahendra singh dhoni clarification on third odi lost against south africa in rajkot

india vs south africa, mahendra singh dhoni, suresh raina, rohit sharma, virat kohli, mahendra singh dhoni updates, ms dhoni press meet, ms dhoni press conference, ms dhoni controversies, india lost third odi against south africa, india south africa series

mahendra singh dhoni clarification on third odi lost against south africa in rajkot : indian captain mahendra singh dhoni given clarification on third odi lost against south africa in rajkot ground.

మూడో వన్డేలో ఓటమికి కారణం అదేనంటున్న ధోనీ

Posted: 10/19/2015 12:44 PM IST
Mahendra singh dhoni clarification on third odi lost against south africa in rajkot

రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భాగంగా దక్షిణాఫ్రికా నిర్దేశించిన (271) స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చతికలపడిపోయింది. కేవలం 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 271 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ లక్ష్యం దిశగా పయనించినా.. చివర్లో కీలక వికెట్లు కోల్పోవడం, సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉండటంతో బోల్తాపడింది. దీంతో టీమిండియా ఆటగాళ్లపై మళ్లీ విమర్శల వర్షం కురుస్తోంది. రెండో వన్డేలో అద్భుతంగా రాణించిన ఇండియా జట్టు.. మూడో వన్డేలో ఎందుకు ఓడిపోయిందంటూ క్రికెట్ అభిమానులు ప్రశ్నలు కురిపించడం మొదలుపెట్టేశారు. దీంతో కెప్టెన్ ధోనీకి ఈ ఓటమిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో పిచ్ స్వభావం పూర్తిగా మారిపోవడంతో తాము లక్ష్యాన్ని సాధించలేకపోయామని కెప్టెన్ ధోనీ అన్నాడు. తొలుత పిచ్ బాగానే అనుకూలించిందని.. కానీ రానురాను స్లోగా మారిందని, దీంతో పరుగులు చేయడం బ్యాట్స్మెన్కు కష్టమైందని చెప్పాడు. తొలుత బ్యాట్స్ మెన్లు లక్ష్యం దిశగా పరుగులు తీసినప్పటికీ.. ఆ తర్వాత పిచ్ సరిగ్గా అనుకూలించకపోవడంతో స్కోర్ చేయడంలో చతికిలపడ్డామని ధోనీ స్పష్టం చేశాడు. అయితే.. ఈ మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగానే రాణించారని ధోనీ కితాబిచ్చాడు. అయితే లక్షసాధనకు దిగాక పిచ్ క్రమేణా నెమ్మదించడంతో, పరుగులు చేయడం కష్టమైందని చెప్పాడు. ఈ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని, స్పిన్నర్లకు సహకరించదని మొదట్లో భావించానని అయితే తన అంచనా తప్పిందని మహీ వివరించాడు. ఇక మిడిలార్డర్లో విఫలమవుతున్న రైనాకు ధోనీ అండగా నిలిచాడు. రైనా షాట్ ఆడబోయేముందు కాస్త సమయం తీసుకోవాలని సూచించాడు.

ఇదిలావుండగా.. మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 270 పరుగులు చేసింది. ఓపెనర్ డీకాక్ (103 నాటౌట్), మిల్లర్ (33) శుభారంభం అందించారు. డు ప్లెసిస్(60), బెహర్దియన్ (33 నాటౌట్) ఆకట్టుకున్నారు. ఇక 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లో రోహిత్ శర్మ(65), విరాట్ కోహ్లి(77), మహేంద్ర సింగ్ ధోని(47)లు రాణించినా.. ఆఖరి ఓవర్లలో తీవ్ర ఒత్తిడికి గురికావడంతో పరాజయం తప్పలేదు. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni press conference  south africa vs india  virat kohli  

Other Articles