భారత్ - దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లలో షెడ్యూలు మేరకు విధులు నిర్వహిస్తున్న పాకిస్తాన్ అంపైర్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి వెనక్కి తీసుకుంది. శివసేన హెచ్చరికల నేపథ్యంలో ఐసీసీ పాక్ అంపైర్‌ను వెనక్కి తీసుకుంది. భారత్ - పాక్ సిరీస్ కోసం బిసిసిఐ - పిసిబి (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చర్చలు జరిపేందుకు సోమవారం ప్రయత్నించారు. దీంతో, ముంబైలోని బిసిసిఐ కార్యాలయానికి శివసేన వెళ్లి అడ్డుకుంది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌ను నిలదీసింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా - భారత్ మ్యాచుల కోసం ఉన్న పాక్ అంపైర్‌ను ఐసీసీ వెనక్కి తీసుకుంది.
పాక్‌కు చెందిన అలిమ్ ధర్ ఐసీసీ ఎంపైర్ ప్యానెల్ మెంబర్. అతను తొలి మూడు వన్డేలకు ఉన్నాడు. ఈ నెల 22న చెన్నైలో జరిగే నాలుగో వన్డే, 25న ముంబైలో జరిగే ఐదో వన్డేకు కూడా షెడ్యూల్ ప్రకారం ఉన్నాడు. అయితే, ముంబైలో శివసేన బిసిసిఐ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి పిసిబితో చర్చలు అడ్డుకునే ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో పాక్‌కు చెందిన అలిమ్ ధర్‌ను వెనక్కి తీసుకుంది. కాగా, భారత్ - పాకిస్తాన్ సిరీస్ అంశంపై ఈ రోజు (మంగళవారంనాడు) ఢిల్లీలో చర్చలు జరిగే అవకాశముందని ఐసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో అలిమ్ ధర్‌ను వెనక్కి తీసుకొని, ఆయన స్థానంలో మరొక ఎంపైర్‌ను నిర్ణయిస్తామన్నారు.
అటు ముంబైలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఆఖరి వన్డే పోరులో పాక్ మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత కామెంటేటర్లు వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్‌లు కనిపించరు. వీరికి భద్రత కల్పించలేమని, అవాంఛిత ఘటనలు జరగవచ్చని భద్రతా అధికారులు చెప్పడంతో.. చెన్నైలో జరిగే నాలుగో వన్డే తర్వాత వీరిద్దరూ పాకగ్ పయనం కానున్నారు. ఈ విషయాన్ని అక్రం ఏజెంట్ ఆర్సలన్ హైడర్ స్పష్టం చేశారు. ముంబై వన్డేకు రెండు రోజుల ముందుగానే 23న వీరు పాకిస్థాన్‌కు పయనం కానున్నారని సమాచారం
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more