3rd ODI: South Africa beat India by 18 runs to take 2-1 lead

Proteas beat india in 3rd odi

India v South Africa at Rajkot, South Africa tour of India, India cricket, South Africa cricket, india vs south africa, ind vs sa, india south africa, india south africa 2015, ind vs sa 2015, cricket news, Saurashtra Cricket Association Stadium, cricket

Virat Kohli's 77 off 99 went in vain as South Africa, riding on Quinton de Kock's century, defeated India by 18 runs in the third one-day international at Saurashtra Cricket Association Stadium in Rajkot on Sunday.

స్వల్ప స్కోరును చేధించలేక చతికిలపడ్డ టీమిండియా

Posted: 10/18/2015 10:16 PM IST
Proteas beat india in 3rd odi

టీమిండియాతో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నిర్థేశించిన 271 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతికిలపడింది. చివర్లో పూర్తిగా చతికిలబడి 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ రోహిత్ శర్మ(65), విరాట్ కోహ్లి(77), మహేంద్ర సింగ్ ధోని(47)లు రాణించినా.. ఆఖరి ఓవర్లలో తీవ్ర ఒత్తిడికి గురికావడంతో పరాజయం తప్పలేదు. మరోసారి శిఖర్ ధవన్(13) నిరాశపరచగా, సురేష్ రైనా(0) డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు.  దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 252 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కల్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా వెన్నువిరవగా, జేపీ డుమినీ, ఇమ్రాన్ తాహీర్ లకు తలో వికెట్ లభించింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు డీ కాక్, డేవిడ్ మిల్లర్ లు శుభారంభం అందించారు. గత  రెండు వన్డేల్లో విఫలమైన మిల్లర్ (33) ఈమ్యాచ్ లో ఫర్వాలేదనిపించినా, మరో ఓపెనర్ డీ కాక్ సెంచరీతో చెలరేగాడు. డీ కాక్ (103 నాటౌట్; 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) నమోదు చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా 38.5  ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులతో భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు కనిపించింది.
 
కాగా..  చివరి 11.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది.  స్వల పరుగుల వ్యవధిలో డీ కాక్, ఏబీ డివిలియర్స్(4), జేపీ డుమిని(14)లు పెవిలియన్ కు పంపి దక్షిణాఫ్రికాను టీమిండియా కట్టడి చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డు ప్లెసిస్(60; 63 బంతుల్లో 6 ఫోర్లు) , బెహర్దియన్ (33 నాటౌట్) ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు  వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో మోహిత్ శర్మకు రెండు వికెట్లు లభించగా, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ లకు తలో వికెట్ దక్కింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Ind vs SA  Rajkot  South Africa  cricket  

Other Articles