Sourav Ganguly singles out Imran Tahir as the biggest threat for India

South africa will not have it easy against india sourav ganguly

India vs South Africa 2015,Indian Cricket,South Africa Cricket,Imran Tahir,Virat Kohli,Hashim Amla,Sourav Ganguly,Cricket, Sourav Ganguly, Imran Tahir, Hashim Amla, India, South Africa

Former India skipper Sourav Ganguly picked out South African leg-spinner Imran Tahir as the man to watch out for India in the upcoming series.

టీమిండియాపై గెలవడం సఫారీలకు అంత సులువుకాదు: సౌరవ్ గంగూలీ

Posted: 09/19/2015 07:59 PM IST
South africa will not have it easy against india sourav ganguly

టీమిండియాపై గెలుపడం అంత సులువైన విషయం కాదని భారత మాజీ కెప్టెన్, టీమిండియా క్రమశిక్షణా సంఘం సభ్యుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా జట్టులో లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కొంత ప్రమాదకర బౌలర్ గా అయన చెప్పుకోచ్చారు.  అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్, ఐదు వన్డే, మూడు టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ప్రశంసించాడు. సపారీలతో జరిగే మ్యాచ్ లలో గెలుపు కోసం బ్యాటింగ్ కూడా కీలక భూమిక పోషిస్తుందని అన్నారు.

సుమారుగా రెండు సంవత్సరాల తరువాత స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న పొడుగాటి సిరీస్ లోనూ టెస్టులకు అధిక ప్రాధాన్యత వుంటుందని అభిప్రాయపడ్డారు. స్పిన్ కు అనుకూలంగా పిచ్ లను సిద్దం చేయడంతో.. ఈ పిచ్ లపై సఫారీల స్పినర్లు ఇమ్రాన్ తాహీన్, హాషిమ్ అమ్లాలు కూడా రాణించే అవకాశముందని వారి బంతులను జాగ్రత్తా ఎదుర్కోవాలని గంగూలీ టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు. ముఖ్యంగా స్వ్కేర్ కట్ షాట్స్ అడే వారు ఇమ్రాన్  బాలింగ్ లో ఇబ్బందులు పడే ప్రమాదముందని చెప్పాడు.

స్వధేశంలో టీమిండియా బాగా రాణిస్తుందని, గత కోన్నేళ్లు స్వదేశంలోని రికార్డులను పథిలపర్చుకుంటున్న టీమిండియా సఫారీలతోనూ భాగానే రాణిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో సౌత్ ఆప్రికాపై నెగ్గుకు వచ్చేందుకు టీమిండియా ఆటగాళ్లకు పలు సూచనలు చేశారు. నాలుగో రోజున వికెట్లు అధికంగా పడతాయని, అప్పటి నుంచి ఆట మలుపుతిరుగుతుందని సూచించారు. స్వదేశంలో మ్యాచ్ లు గెలవడానికి బ్యాటింగ్ కూడా కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. స్కోరుబోర్డుపై 500 పైచిలకు పరుగులను నిలపి.. ప్రత్యర్థులకు ఆ లక్ష్యాన్ని నిర్ధేశిస్తే విజయం టీమిండియాను వరించే అవకాశాలున్నాయని అశాభావం వ్యక్తం చేశారు. గెలుపే లక్ష్యంగా, గెలవడమే అంతా అన్నట్లుగా వ్యవహరించే విరాట్ కోహ్లీ.. బాడీ లాంగ్వేజ్ అప్పుడప్పుడు పరిధి దాటినా.. ఆయన మైండ్ సెట్ మాత్రం తనకు చాల నచ్చుతుందని గంగూలి కోహ్లీని వెనకేసుకుని వచ్చాడు. అతనిపై ప్రశంసలను కురిపించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sourav Ganguly  Imran Tahir  Hashim Amla  India  South Africa  Cricket  

Other Articles