India Crush Bangladesh to Avoid Humiliating Series Whitewash

India vs bangladesh hosts stumble in chase of 318

Live Score, Live Cricket Score, Cricket,Ind vs Ban, 2015, Shere Bangla National Stadium, Mirpur,Shikhar Dhawan, Mustafizur Rahman, Virat Kohli, MS Dhoni, Bangladesh, India, Bangladesh vs India, Final ODI Highlights: India Crush Bangladesh to Avoid Humiliating Series Whitewash latest Ind vs Ban, 2015 news

After Shikhar Dhawan and MS Dhoni's exploits with the bat, India bowlers restricted Bangladesh to salvage pride and avoid a series whitewash. Bangladesh win series 2-1.

బంగ్లావాష్ నుంచి తప్పించుకున్న ధోనిసేన.. 3వ వన్డేలో విజయం

Posted: 06/24/2015 11:16 PM IST
India vs bangladesh hosts stumble in chase of 318

భారత్తో మిర్పూర్ వేదికగా షేరే బంగ్లా స్టేడియంలో జరుగుతున్న చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్లో అతిధ్య జట్టు బంగ్లాదేశ్ ను ఓడించిన ధోని సేన బంగ్లా వాష్ నుంచి తప్పించుకుంది. పసికూన చేతితో వరుసగా రెండు వన్డేలు జారవిడుచుకున్న టీమిండియా.. ఎట్టకేలకు చివరి మ్యాచ్ ను గెలిచి పరుపు నిలబెట్టుకు్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకున్న బంగ్లా.. భారత్ నిర్ధేశించిన 318 పరుగులు విజయలక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. ఫలితంగా ధోని సేన 77 పరుగులతో బంగ్లాపై చివరి టెస్టులో విజయం సాధించింది. అయితే సీరిస్ మాత్రం రెండు వన్డేలు గెలిచిన బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది.

భారత్ నిర్ధేశించిన 318 పరుగుల విజయలక్ష్యాన్ని సాధించడంలో బంగ్లా సేన చతికిల పడింది. ఓపెనర్ తకీయ్ ఐదు పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద వెనుదిరగగా, మరో ఓపెనర్ సౌమ్యసర్కార్, లిట్టన్ దాస్ లు మంచి ప్రారంభాన్నే ఇచ్చారు. 62 పరుగులు వద్ద సౌమ్య సర్కార్ వెనుదిరగడంతో స్కోరు బోర్డును కదిలిక మొల్లిగానే ముందుకు సాగింది. ఆ తరువాత వచ్చిన రహీ్ కూడా 24 పరుగులకే వెనుదిరిగాడు. అ తరువాత మూడు ఓవర్లకు లిట్టన్ దాస్ 148 పుగుుల వద్ద ఐదో విక్కెట్ గా వెనుదిరిగాడు.  మిడిల్ ఆర్డర్లో రహామన్, నాసిక్ హోస్సెన్ లు మాత్రమే రాణించారు. దీంతో బంగ్లా దేశ్ 240 పరుగుల వద్ద అలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో సురేష్ రైనా మూడు విక్కెట్లు సాధించగా, కులకర్ణి, రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు విక్కట్లు సాధించారు. బిన్నీ, అక్షర్ పటేల్ లు తలో వికెట్ సాధించి..బంగ్లాను అలౌట్ చేయడంలో సఫలీకృతమయ్యారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 317 పరుగులు సాధించింది. 39 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పయిన టీమిండియాను సూపర్ ఫామ్ లో వున్న ఓపెనర్ శిఖర్ ధావన్, కోహ్లీలు ఆదుకున్నారు. వీరిద్దరూ రెండోె వికెట్ కు 75 పరుగులు జోడించారు. కోహ్లీ కూడా 25 పరుగుల వద్ద వెనుదిరగడతో.. రంగంలోకి దిగిన ధోని.. ఆదుకుని భారీ స్కోరు దిశగా స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో అర్థసెంచరీ కొట్టిన ధావన్ 75 పరుగులు సాధించగా, ధోని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ తో 69 పరుగులు సాధించి వెనుదిరిగాడు. కాగా అంబటి రాయుడు 44 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అంఫైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవీలియన్ చేరాడు. ఆఖరి ఓవర్లలో వచ్చిన సురేష్ రైనా వేగంగా 21 పరుగులు సాధించాడు బంగ్లా బౌలర్లలో మోర్తజా 3 వికెట్లు, ముస్తాఫిజుర్ రహమాన్ 2 వికెట్లు, షకీబ్ కు ఒక వికెట్ లభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  India  Shere Bangla National Stadium  Mirpur  3rd ODI  

Other Articles