టీమిండియా బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి వరుణుడు వరుసగా అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్ ప్రారంభం నుంచే వరుణుడు పూర్తి అడ్డంకిగా నిలువగా, ఇవాళ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏకైక టెస్టుపై సట్టు సాధించినా.. ఫలితం రాకపోవడంతో టీమిండియా నిరాశే ఎదురైంది. ఫలితంగా అంతర్జాతీయ టెస్టు క్రికెట్ ర్యాకింగ్ లో టీమిండియా ర్యాంకు మూడో స్థానం నుంచి దిగజారి ఐదో స్థానానికి చేరుకుంది.
వరణుడి ప్రభావమే ఇండియాను విజయానికి దూరం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 253 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లా.. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. దీంతో టెస్టు డ్రాగా ముగిసింది.
భారత ఓపెనర్ శిఖర్ ధావన్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ధావన్ (173), విజయ్ (150), సెంచరీలతో ఆకట్టుకోగా.. రహానె (98) త్రుటిలో సెంచరీ మిస్సయ్యాడు. చక్కటి ప్రతిభను కనబరిచారని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించారు. తొలి ఇన్నింగ్స్లో రవించంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ సింగ్ 3 వికెట్లు తీశాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఉల్ హసన్ నాలుగు, జుబేర్ హసన్ రెండు వికెట్లు పడగొట్టారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more