Fatullah Test: Virat Kohli calls for reserve day for Test matches after washout

Virat kohli lauds india s selfless showing in fatullah test

Virat Kohli, Test cricket, reserve day, ODIs, Cricket, Bangladesh, India, India tour of Bangladesh, ind vs Ban, 2015, Cricket, Ind vs Ban 2015 news, Glenn McGrath, India, Bangladesh, Test, Fatullah Test, India vs Bangladesh, India bangla tour, India score, bangla score, Khan Shaheb Osman Ali Stadium, Fatullah bangladesh, Sports,

Left frustrated by rain interruptions which scuttled the chance of an outright result against Bangladesh in the one-off Test in Fatullah, Indian cricket captain Virat Kohli on Sunday said it is not a bad idea to have reserve days for the longer-format games as well.

ఐసిసికి కొత్త సూచనను అందించిన విరాట్ కోహ్లీ

Posted: 06/14/2015 09:05 PM IST
Virat kohli lauds india s selfless showing in fatullah test

బంగ్లాదేశ్ లోని ఫతుల్లాలో జరిగిన భారత్ బంగ్లా ఏకైక టెస్టు డ్రాగా ముగియడంతో.. టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ గా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడానికి వరుణుడు కారణం కాబట్టి.. ప్రకృతిపై తన నిసృహను వ్యక్తం చేసిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్ మండలికి సరికోత్త సూచనను అందించారు. అదేంటంటారా..? వన్డే మ్యాచ్ లకు ఉన్నట్టుగానే టెస్ట్ లకూ రిజర్వు డే ఉంటే బాగుంటుందని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొత్త సూచన చేశాడు.

పొడుగు ఫార్మెట్ కూ రిజర్వు డే ఉండాలన్న తన సూచనపై చర్చ జరగాలన్నాడు. భారత్-బంగ్లాదేశ్ ఏకైక టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత కోహ్లి విలేకరులతో మాట్లాడాడు. '250 పైగా ఓవర్ల పాటు సాగిన టెస్టు మ్యాచ్ ఈరోజు డ్రాగా ముగిసింది. టెస్టులకూ రిజర్వు డే పెట్టి చూడాలి. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఫలితం కోసం మరొక్క రోజు పొడిగించే అవకాశాన్ని పరిశీలించాలి. దీనిపై చర్చలు ఎలా జరుగుతాయనేది నాకు తెలియదు' అని కోహ్లి అన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reserve day  Virat Kohli  test match  

Other Articles