Bangladesh vs India, Fatullah Test Day 4 Highlights: Steady Drizzle Ruins Ashwin-Harbhajan Hardwork

India vs bangladesh test india dominate as rain plays spoilsport again

Bangladesh, Team India, Virat Kohli, Ind vs Ban, 2015, Cricket, Ind vs Ban 2015 news, Glenn McGrath, India, Bangladesh, Test, Fatullah Test, India vs Bangladesh, India bangla tour, India score, bangla score, Khan Shaheb Osman Ali Stadium, Fatullah bangladesh, Sports, Shikhar Dhawan, murali vijay, Ajinkya Rahane, Sher-e-Banglam harbajan singh, MS Dhoni, Richest athletes, cricket, Cricketer Mahendra Singh Dhoni, Former selector Raja Venkat, captaincy, india tour of bangladesh 2015, Ravichandran Ashwin, Murali Vijay, India vs Bangladesh,Harbhajan Singh

India declared overnight on 462/6 before R Ashwin picked up two wickets and Harbhajan Singh took one to reduce Bangladesh to 111/3. Rain forced two sessions to be completely washed out on Day 4.

ఏకైక టెస్టులో నాల్గవ రోజు వరుణుడి అడ్డంకి.. బంగ్లా స్కోరు 111-3

Posted: 06/13/2015 06:54 PM IST
India vs bangladesh test india dominate as rain plays spoilsport again

టీమిండియా బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కి వరుణుడు వరుసగా అంతరాయం కలిగిస్తున్నాడు. ఐదు రోజుల టెస్టు మ్యాచ్ ప్రారంభం నుంచే వరుణుడు పూర్తి అడ్డంకిగా నిలువగా, ఇవాళ కూడా అదే పరిస్థితి ఏర్పడటంతో నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంఫైర్లు ప్రకటించారు. ఇవాళ కేవలం 30 ఓవర్లు మాత్రమే టీమిండియా వేయగలిగింది. ముప్పై ఓవర్లలో బంగ్లాదేశ్ మూడు విక్కెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. వరుణుడు అడ్డండికిగా నిలవడంతో.. మధ్యహ్నం తరువాత జరగాల్సిన రెండు సెషన్లను అంపర్లు రద్దు చేశారు.

మూడో రోజు ఓవర్ నైట్ స్కోరుతో 462-6తో ఢిక్లేర్ చేసిన టీమిండియా.. నాల్గవ రోజున ఉదయం నుంచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా జట్ట ఏకైక టెస్టు మ్యాచ్ లో బోజన సమయానికి మూడు విక్కెట్ల నష్టానికి 111 పరుగులు సాధించిందిం. బంగ్లా ఆటగాళ్లలో ఇమ్రుల్ కేయ్స్ (59), షకిబుల్ హసన్(0) లు క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు తమీమ్ ఇక్బాల్(19), మామ్మినుల్ హక్యూ(30),రహీమ్(2) పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో  అశ్విన్ రెండు వికెట్లు తీయగా, హర్భజన్ సింగ్ కు ఒక వికెట్ లభించింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కన్నా 351 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, మధ్యాహ్నం తరువాత మరోమారు వరుణుడు విజృంభించడంతో ఇవాళ జరగాల్సిన మరో రెండు సెషన్లను అంపర్లు రద్దు చేశారు. ఇదిలావుండగా, ఇంకా కేవంల ఒక్క రో జు మాత్రమే మిగిలివుండటంతో.. బంగ్లాదేశ్ పూర్తిగా అల్ అవుట్ అయిన తరువాత.. మ్యాచ్ లో ఇరు జట్లు మరో ఇన్నింగ్స్ ఆడాల్సిన వుంది. దీంతో మ్యాచ్ ఫలితం ఎటూ తెలకుండానే పోతుందని క్రికెట్ అభిమానుల్లో సందేహాలు రేకెత్తుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakib-al-Hasan  teamindia  bangladesh tour  

Other Articles