టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిపై బ్యాటింగ్ లెజెండ్, ఇండియన్ క్రికెట్ గ్రేట్ వాల్, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పాత్ర అద్భుతమైని కొనియాడారు. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రినే నియమిస్తే బాగుంటుందని అయన అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. బంగ్లా పర్యటనకు ముందు బీసీసీఐ.. రవిశాస్త్రికి జట్టు డైరెక్టర్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పిన నేపథ్యంలో రాహుల్ కామెంట్లు బలాన్నిచ్చాయి. రవిశాస్త్రికి అ పదవిలోనే పూర్తిస్థాయిలో కోనసాగిస్తే.. బాగుంటుందని రాహుల్ ద్రావిడ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీమిండియా కోచ్‌గా ఢంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగియడంతో ఆయన రాజీనామా చేసినప్పటి నుంచి కోచ్ పదవికి ఖాళీగా ఉంది.
టీమిండియా టెస్టు జట్టుకు కెప్టెన్ కొపసాగుతున్న విరాట్ కోహ్లీపై స్పందించిన ద్రవిడ్ ఆయన ఈ కొత్త బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించేందుకు కొంత సమయం కావాలని అభిప్రాయపడ్డారు. కోహ్లీ విషయంలో అభిమానులు కొంత సమయం వేచిచూడాలని అన్నారు. రాబోయే రోజుల్లో కెప్టెన్‌గా మంచి నిర్ణయాలు తీసుకుంటాడని తెలిపారు. ఆస్టేలియాలో జరిగిన వరల్డ్ కప్‌లో టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పాత్ర మాత్రం వెలకట్టలేనిదని చెప్పారు. మాజీ కెప్టెన్‌గా శాస్త్రి అనుభవం జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎలాంటిసందేహం లేదని రాహుల్ తెలిపాడు. టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి అద్భుతమైన పాత్రను పోషిస్తున్నాడని చెప్పిన ద్రవిడ్, వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్ నిష్క్రమణపై మాత్రం స్పందించలేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more