Cricket: Team India touches down in Bangladesh for short series

Virat kohli lead indian cricket squad arrives in dhaka for short tour

Cricket, Virat Kohli, Team India, Bangladesh, tests, Ravi Shastri, team india test captain virat kohli, team india bangladesh tour, bangladesh tour, indian cricket team, Dhaka, Indian cricket squad, short series

The Virat Kohli-led Indian cricket squad arrived at Dhaka on Sunday for a short series against Bangladesh, featuring a one off Test that begins on Wednesday followed by three One-day Internationals

కోహ్లీ సారథ్యంలో ఢాకా చేరుకున్న టీమిండియా టెస్టు జట్టు..

Posted: 06/08/2015 06:35 PM IST
Virat kohli lead indian cricket squad arrives in dhaka for short tour

బంగ్లాదేశ్‌తో మొదటగా ఐదు రోజుల పాటు సాగే టెస్టు మ్యాచ్ లో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో బయలుదేరి వెళ్లిన టీమిండియా జట్టు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను చేరుకుంది. బంగ్లాదేశ్ తో జరగనున్న షార్ట్ సీరీస్ ( ఒక టెస్టు, మూడు వన్డేలు)లో భాగంగా నిన్న బయలుదేరిన 14 మంది సభ్యులు గల టీమిండియా టెస్టు క్రికెట్ జట్టు ఇవాళ డాకాకు చేరుకుంది. బుధవారం నుండి ఫతుల్లాహ్ లో ఇరు జట్ల మధ్య టెస్టు సీరీస్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీకి పూర్తిస్థాయిలో టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు లభించిన తరువాత జరుగుతున్న తోలి టెస్టు కావడంతో అభిమానుల్లో కూడా ఉత్కంఠ రేకెత్తుతుంది.

పాకిస్థాన్ తో ఇటీవల జరిగిన సీరీస్ లో తమ అత్యత్తమ ప్రతిభను కనబర్చిన బంగ్లాదేశ్ మంచి ఊపు మీద వుంది. అలాంటి జట్టును వారి సోంత గ్రౌండ్ లోనే మట్టికరిపించి విజయం సాధించాలని విరాట్ జట్టు ఉవ్విళ్లూరుతుంది. బంగ్లాదేశ్ పర్యటనకు ప్రకటించిన జట్టులో ఓపెనర్ కెఎల్ రాహుల్ జ్వరంతో బాధవడుతుండటంతో ఆయన స్థానం ఖాళీగా వుండిపోయింది. సుమారు రెండేళ్ల మూడు మాసాల తరువాత భారత ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కు టెస్టు జట్టులో స్థానం లభించడంతో.. ఆయన కూడా తనకు లభించిన అవకాశాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ తో ఇప్పటివరకు జరిగిన ఏడు టెస్టుల్లో భారత్ ఆరు టెస్టు మ్యాచ్ లను గెలుపోందగా, ఒకటి డ్రాగా ముగిసింది


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  indian cricket team  Ravi sastri  Bangladesh  

Other Articles