Time to start winning Tests says virat kohli

I don t think we need to play with a mindset of playing to learn

Cricket, Virat Kohli, Team India, Bangladesh, tests, Ravi Shastri, team india test captain virat kohli, team india bangladesh tour, bangladesh tour, indian cricket team

Not quite convinced about the idea of counting the positives after a lost match, India's new Test captain Virat Kohli on Sunday said the days of learning are long over and his cricket team would be solely focussed on delivering results.

గెలుపే లక్ష్యంగా.. బరిలోకి దిగాల్సిందే..

Posted: 06/08/2015 05:54 PM IST
I don t think we need to play with a mindset of playing to learn

పరాజయం పోందిన ప్రతీ మ్యాచ్ నుంచి నేర్చకున్నది చాలునని, ఇకపై టీమిండియా విజయాలపైనే దృష్టిని కేంద్రీకరించాలని భారత టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పూర్తి భిన్నమైన మనత్తత్వంతో వున్న విరాట్ దోణి టెస్టు క్రికెట్ కు రాజీనామా చేయడంతో.. నూతనంగా ఈ బాధ్యతను చేపట్టారు. ఒకటి రెండు మ్యాచ్ లకు ఆయన తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినా.. తాజా బంగ్లాదేశ్ పర్యటనతో ఆయన టెస్టు క్రికెట్ కు పూర్తి బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన జట్టులోని ఆటగాళ్లంతా సంపూర్ణ ఉత్సాహంతో ఉన్నారన్నారు. కొంత విరామం తర్వాత బంగ్లాదేశ్ పర్యటన కొత్త ఆరంభంగా నిలుస్తుందని చెప్పారు. ఇరు జట్ల మధ్య ప్రపంచకప్ క్వార్టర్స్ మ్యాచ్ ప్రభావం, ప్రతీకారం తీర్చుకోవడంలాంటిది ఇక్కడ ఏమీ ఉండదని... అదంతా గతమని చెప్పుకోచ్చారు.

 కెప్టెన్సీపై : టెస్టు కెప్టెన్‌గా నేను కూడా ఎంతో ఉద్వేగంగా ఉన్నాను. వన్డేలు, టి20లతో పోలిస్తే టెస్టు కెప్టెన్సీ భిన్నం. కాబట్టి దానికి సంబంధించి నా దృష్టిలో భిన్నమైన వ్యూహాలు ఉన్నాయి. గతంలో కెప్టెన్సీ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొత్త కాదు. ఆస్ట్రేలియాలో నాయకత్వం వహించినప్పుడు చాలా నేర్చుకున్నాను. టీమ్ బాగుంది కాబట్టి అదే నిలకడను కొనసాగిస్తాను.  

టీమిండియా ఇప్పటికే చాలా నేర్చుకుందని, ఇంకా నేర్చుకోవాలనే ఆలోచనతో మ్యాచ్ బరిలోకి దిగడం, నేర్చుకుంటూనే ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తాము తగినన్ని టెస్టులు ఆడామని. ఇకపై ఆ ప్రతిభను ఉపయోగించుకోవాలే కానీ, నేర్చుకోవాల్సిన అవసరం రాకూడదని చెప్పారు. గతానుభావాలను దృష్టిలో పెట్టుకుని టెస్టులు గెలవడమే లక్ష్యంగా మైదానంలోకి దిగాలన్నారు.. ఇకపై ఫలితాలు సాధించడమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు, మ్యాచ్‌ను గెలిపించలేని సెంచరీ వృథా. కాబట్టి ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే వాతావరణం తాను కల్పిస్తానన్నారు.. మ్యాచ్ గెలవాలంటే ముందుగా మైండ్‌సెట్ కూడా అలాగే ఉండటం అవసరమన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  indian cricket team  Ravi sastri  Bangladesh  

Other Articles