Bangladesh vs India: Indian team arrives and gets off to training in Dhaka for one-off Test

Team india gets off to training after landing in dhaka

Bangladesh, Team India, Virat Kohli, Glenn McGrath, Ind vs Ban, 2015, Cricket Glenn McGrath Backs Team India to be Lethal in Solo Test vs Bangladesh, latest Ind vs Ban 2015 news, Glenn McGrath, India, Bangladesh, Test, Fatullah Test, India vs Bangladesh, Virat Kohli, India bangla tour, India score, bangla score, Khan Shaheb Osman Ali Stadium, Fatullah bangladesh, Sports, Cricket, Umesh Yadav, Shikhar Dhawan, Bhuvneshwar Kumar, Ajinkya Rahane, Sher-e-Banglam harbajan singh

The Indian cricket team got down to work soon after landing for the short series against Bangladesh, sweating it out in a gruelling two-hour net session at the Sher-e-Bangla Stadium.

బంగ్లాతో టీమిండియా ఏకైక టెస్టు.. విజృంభించేందుకు కోహ్లీ సేన రెఢీ

Posted: 06/09/2015 05:34 PM IST
Team india gets off to training after landing in dhaka

బంగ్లాదేశ్ తో ఒక టెస్టు మూడు వన్డే మ్యాచ్ లతో చిన్న సీరీస్ కోసం బయలుదేరి వెళ్లిన టీమిండియా.. ఎలాగైనా బంగ్లాతో రేపటి నుంచి జరగనున్న టెస్టు మ్యాచ్ లో అధిపత్యం సాధించేందుకు సిద్దం అవుతోంది. ఇందుకోసం నిన్న ఢాకా చేరుకోగానే ఎలాంటి విశ్రాంతి లేకుండా నేరుగా స్థానికంగా గల షేర్ ఏ బంగ్లా క్రికెట్ స్టేడియంలో భారత్ క్రీడాకారులు చమటోడ్చారు. ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ వంటి జట్టును మట్టికరిపించి ఫ్లే ఆఫ్ కు చేరిన బంగ్లాను తక్కువగా అంచనా వేయరాని పలువురు ప్రముఖ క్రికెటర్లు సూచనలను పరిగణలోకి తీసుకున్న టీమిండియా జట్టు.. ఎలాగైనా టెస్టు మ్యాచ్ లో విజయం సాధించేందుకు కృత నిశ్చయంతో వుంది.

అటు టెస్టు కెప్టెన్ గా తనపై పూర్తి విశ్వాసాన్ని చూపిన భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐకి బంగ్లా టెస్టును గెలచి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇందుకోసం జట్టు సభ్యులను కూడా హుషారెత్తించేందుకు సిద్దమైన కోహ్లీ.. ఢాకాలో దిగిన వెనువెంటనే ప్రాక్టీసుకు సిద్దం అయ్యాడు. అటు జట్టు సభ్యులతో కూడా ఉల్లాసంగా హుషారెత్తించారు. అటు రెండేళ్ల తరువాత టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించిన హాఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ కూడా తన స్ఠానాన్ని పధిలం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన అందివచ్చిన బంగ్లాటెస్టు తో తన సత్తాను నిరూపించుకోవాలని ఉత్సాహపడుతున్నారు.

ఇటీవల తమకన్నా బలమైన దేశం పాకిస్థాన్ తో జరిగిన సీరీస్ లో తమ సత్తాను చాటిని బంగ్లాదేశ్.. అంతకు రెట్టింపు ఉత్సాహంతో టీమిండియాపై గెలుపుకోసం ప్రయాత్నలను ముమ్మరం చేసింది. సొంతగడ్డపై జరగనున్న పోరులో విజయాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తుంది. టెస్టు మ్యాచ్ పై పట్టుబిగిస్తే.. ఆ ఒత్తిడి వన్డే మ్యాచ్ లపై కూడా పడుతుందని, దీంతో వన్డేలను కూడా గెలుచుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది. అయితే బంగ్లాదేశ్, టీమిండియాల మధ్య రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టుకు ఫతుల్లాహ్ లోని  ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలి స్టేడియం వేదిక కానుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakib-al-Hasan  teamindia  beneficial  bangladesh tour  

Other Articles