Bangladesh tour will be a challenge for Virat Kohli: Mohammad Kaif

Test captaincy will be a challange for virat koh

test cricket captain virat kohli, former indian cricket player mohammad kaif, kaif on virat kohli, Indian cricket team, bangladesh cricket team, challange to virat kohli, Virat Kohl|, Mohammad Kaif, Mahendra Singh Dhoni, India in Bangladesh 2015, Bangladesh vs India 2015

Virat Kohli|Mohammad Kaif|Mahendra Singh Dhoni|India in Bangladesh 2015|Bangladesh vs India 2015

బంగ్లా టెస్టు కోహ్లీ కెప్టెన్సీకి పెద్ద సవాలే

Posted: 06/07/2015 06:52 PM IST
Test captaincy will be a challange for virat koh

టెస్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడం భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీకి అతిపెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. త్వరలో టీమిండియా టెస్టు జట్టుకు పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోనున్న విరాట్ కోహ్లీకి బంగ్లాదేశ్ పర్యటన పెద్ద ఛాలెంజ్ గా అభివర్ణించాడు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే బంగ్లాదేశ్ చాలా ధృడంగా కనిపిస్తోందని.. ఈ తరుణంలో బంగ్లాదేశ్ లో టెస్టు క్రికెట్ పెద్ద సవాల్ అని పేర్కోన్నారు. సోంత గ్రౌండ్ లో బంగ్లా ఆటగాళ్లు బాగా రాణిస్తారని అభిప్రాయపడ్డారు.  
 
ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ లో వారు అమోఘంగా రాణించి ఆకట్టుకున్నారన్నాడు. ఈ నేపథ్యంలో ఆ సిరీస్ తప్పకుండా కోహ్లీకి ఒక సవాల్ గా మారనుందని  పేర్కొన్నాడు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా బుధవారం(జూన్ 10) నుంచి టీమిండియా తన తొలి టెస్టును ఆడనుంది. ఈ సంవత్సర ఆరంభంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ ఐదు రోజుల ఫార్మెట్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.  దీంతో ఆ సిరీస్ చివరి టెస్టులో విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా  ఎంపికయ్యాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammad Kaif  team india  virat kohli  test captain  

Other Articles