Australia won worldcup 2015 quarter final match against pakistan

australia vs pakistan, icc worldcup 2015, pakistan vs australia match, pakistan cricket team, australia cricket team

australia won worldcup 2015 quarter final match against pakistan : finally australia has won quarter final match against pakistan in worldcup 2015.

పాక్ ను ఇంటివైపు పరుగులు పెట్టించిన కంగారులు

Posted: 03/20/2015 06:12 PM IST
Australia won worldcup 2015 quarter final match against pakistan

ప్రపంచకప్ లో భాగంగా ఆడిలైడ్ లో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పై 6 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. తొలుత ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు తడబడినా.. ఆ తర్వాత వచ్చినవాళ్లు కాస్త పుంజుకుని, జట్టును గెలుపు తీరానికి తీసుకెళ్లారు. తన బ్యాటింగ్ ప్రతిభతో పాక్ ఆటగాళ్లను కంగారెత్తించిన ఆసీస్.. చివరికి వారిని ఇంటిదారి పట్టించారు. దీంతో సెమీ ఫైనల్ లో భారత ప్రత్యర్థి జట్టుగా ఆస్ట్రేలియా ఖరారైంది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు.. 49.5 ఓవర్లలో కేవలం 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేయడానికి బరిలోకి దిగిన ఓపెనర్స్ ఇద్దరు పేలవ పెర్ఫార్మాన్స్ ప్రదర్శించి వెంటనే పవెలియన్ చేరడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. దీంతో తర్వాత వచ్చిన ఆటగాళ్లు నెమ్మదిగా ఆటను కొనసాగించాల్సి వచ్చింది. కొద్దిసేపటివరకు నిలకడగా బ్యాటింగ్ చేసిన పాక్ ఆటగాళ్లు.. కంగారుల బౌలింగ్ దెబ్బకు బెంబేలెత్తిపోయారు. తమ వికెట్ కాపాడుకోవడం కోసం నానాతంటాలు పడ్డారు కానీ.. చివరకు టపీటపీమని పడిపోయారు. దీంతో పాక్ ఆటగాళ్లు.. షెహాజాద్ 5, సర్ఫరాజ్ 10, సోహేల్ 41, హాక్ 34, అక్మల్ 20, మసూద్ 29, ఆఫ్రిది 23, రియాజ్ 16, అడిల్ 15, సోహేల్ ఖాన్ 4, అలీ 6 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి వస్తే.. హాజ్లేవుడ్ 4, స్టార్క్, మ్యాక్స్‌వెల్ చెరో రెండు, ఫాల్‌క్నేర్, జాన్సన్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.

ఇక 214 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లను మొదట పాక్ బౌలర్లు బాగానే కంగారెత్తించారు. ఈ దెబ్బతో ఓపెనర్లు తక్కువ స్కోరు వద్దే పవెలియన్ చేరారు. ఆసీస్ లో ఎంతో ప్రతిభగల ఆటగాళ్లు ఫించ్ 2, క్లార్క్ 8 వెనుదిరగడంతో ఆసీస్ కాస్త చిక్కుల్లో పడిపోయింది. దీంతో ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు తమ జట్టును గెలు దిశగా తీసుకెళ్లారు. స్మిత్ 65, వాట్సన్ 64, మాక్స్ వెల్ 44 పరుగులు సాధించి.. జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 33.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 216 స్కోరును సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. ఇక పాక్ బౌలర్లలో రియాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇదిలావుండగా.. ఈ విజయంతో 7 సార్లు వరల్డ్ కప్ పోటీల సెమీస్ లోకి అడుగుపెట్టిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : australia vs pakistan match  icc worldcup 2015  

Other Articles