Mahendra singh dhoni india cricket team bowling batting orders icc world cup 2015

mahendra singh dhoni news, india cricket team bowling, india cricket team batting, dhoni press meet, dhoni interview, dhoni comments, dhoni batting news, dhoni world cup, india cricket team world cup 2015

mahendra singh dhoni india cricket team bowling batting orders icc world cup 2015 : India cricket team captain mahendra singh dhoni feeling uncomfirtable with bowling and batting orders.

పిచ్చ పీక్స్’తో తలగోక్కుంటున్న ధోనీ..?

Posted: 02/11/2015 04:50 PM IST
Mahendra singh dhoni india cricket team bowling batting orders icc world cup 2015

టీమిండియాలో చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు, ఎలా, ఎవరితో ఆటాడించాలోనన్న తలనొప్పితో ధోనీ తలగోక్కుంటున్నాడని సమాచారం! టీమ్ మేనేజ్ మెంట్ ఎంచుకున్న ఆటగాళ్లలో అందరూ కొత్తవాళ్లే అయిన సందర్భంగా అది ధోనీపై ప్రభావం చూపుతోందని సమాచారం! అందుకే.. ఈయన నిస్సిగ్గుగా ఏం చేయాలో తోచలేదంటూ మీడియా ముందు బహిర్గంగా వ్యాఖ్యానించారు. అయితే.. తనకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు జట్టులో కూర్చు జరిగేలా ప్రయత్నాలు చేస్తానని, ముందుకు నడిపంచే కృషి చేస్తానన్నట్లుగా పేర్కొన్నారు.

ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో కొన్ని మార్పులు జరగడంతో ధోనీకి కాస్త ఇబ్బందిగా మారింది. వరల్డ్ దగ్గరపడుతుంటే కొందరు గాయాలతో బాధపడుతుండగా.. మ్యాచ్ ప్రారంభమయ్యేలోపు ఎవరు ఫిట్’గా తయారవుతారో, ఎవరు తప్పుకుంటారో తెలియని అయోమయ పరిస్థితి! ఇదే ధోనీకి పెద్ద సమస్యగా మారింది. యువ పేసర్ భువనేశ్వర్ ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే! అతనికి ఆ గాయం తగలడం వల్లే బౌలింగ్ కూర్పుపై అనిశ్చితి ఏర్పడింది. భువీ ఫిట్ నెస్ టెస్టులో నెగ్గినా.. అతడి మ్యాచ్ సన్నద్ధతపై సందేహాలు మాత్రం తొలగిపోలేదు. అందుకే.. అతనికి బ్యాకప్’గా ధవళ్ కులకర్ణిని ఆస్ట్రేలియాలోనే వుండాలని టీమిండియా మేనేజ్ మెంట్ కోరింది.

ఒక్కసారిగా ఇటువంటి పరిస్థితి ఎదురుకావడంతో.. పాక్’తో ఆడే ప్రతిష్టాత్మక మ్యాచ్’తో పలు గ్రూప్ మ్యాచులకు బౌలింగ్ కాంబినేషన్లు ఎలా సెట్ చేయాలన్న అంశంపై ధోనీ పిచ్చిపట్టినట్లుగా తల బద్ధలు కొట్టుకుంటున్నాడని సమాచారం! అలాగే.. బ్యాటింగ్ విభాగంలో ఆటగాళ్లు సరిగ్గా ఆడని పక్షంలో వారి ఆర్డర్’లో మార్పులు చేయాలా..? వద్దా..? అన్న సందిగ్ధతలోనూ మునిగాడు. గతంలో ఇలా మార్పులు చేయడం వల్ల విమర్శలు ఎదుర్కొన్న ధోనీకి ఆ అంశంపైనా ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ధోనీ పరిస్థితి చూస్తుంటే.. పిచ్చ పీక్స్’తో ఓ పిచ్చోడిలా మారిపోయిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

ఇంత గందరగోళ పరిస్థితులు వున్నప్పటికీ.. పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ కూర్పు వుంటుందని ధోనీ మీడియాతో అన్నాడు. అలాగే పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ మార్పులు సవరిస్తామన్నట్లుగా అతడు అభిప్రాయం వ్యక్తపరిచాడు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘాన్’తో గెలిచిన వార్మప్ మ్యాచ్ తమకు సంతృప్తినిచ్చిందని, ఆ తరహాలో ప్రతిభను కొనసాగిస్తూ వరల్డ్ కప్’లో గెలిచే ప్రయత్నాలు చేస్తామని వెల్లడించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra singh dhoni news  india cricket team  icc world cup 2015  

Other Articles