India vs pakistan world cup clash to be most watched match in history

india vs pakistan, world cup 2015, ind vs pak world cup match, ind vs pak most watched match, most watched cricket match in history, India, Pakistan match, 100 million viewers

india vs pakistan world cup clash to be most watched match in history

ఆ మ్యాచ్ రికార్డులను బద్దలు కోట్టనుంది..!

Posted: 01/13/2015 01:08 PM IST
India vs pakistan world cup clash to be most watched match in history

ఆ మ్యాచ్ పైనే ఎన్నో ఆశలు.. గత కొన్నేళ్లుగా సాగుతున్న ప్రరోక్ష యుద్ద వాతావరణ నేపథ్యంలో దాయాది దేశాల మధ్య ప్రత్యక్ష యుద్దాన్ని తలపిస్తుంది ఆ మ్యాచ్. ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో వున్న అన్ని రికార్డలను బద్దలుకోట్టి, రికార్డులను తిరగరాస్తు.. ముందుకు వెళ్తోంది. ఇంతకీ ఆ మ్యాచ్ ఎవరిదో తెలుసా.. భారత్, పాకిస్థాన్ లు తలపడుతున్న మ్యాచ్. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్ నూతన అధ్యాయాలను తన పేరున నమోదు చేసుకోబోతోంది. ఫిబ్రవరి 15న అస్ట్రేలియాలోని అడిలైట్ లో జరగనున్నా ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు విక్రయించిన టిక్కెట్లు..హాట్ కేకుల్లా కేవలం గంటలోపు అమ్మడయ్యాయి.

ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా దాయాదులు తలపడుతున్న తదుపరి మ్యాచ్‌ను వివిధ మాధ్యమాల ద్వారా వంద కోట్లకు పైగా అభిమానులు వీక్షించే అవకాశం ఉందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. 2011 ప్రపంచకప్ సెమీస్‌లో తలపడిన ఈ రెండు జట్ల మ్యాచ్‌ను 98 కోట్ల 80 లక్షల మంది తిలకించారు. ఈసారి ఆ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎగబడడంతో ఆరు నెలల కిందటే అమ్ముడయ్యాయి.

దీంతో ఇక ఇతర మాధ్యమాల ద్వారా మ్యాచ్ ను తిలకించేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. 2011లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా అప్పట్లో దేశంలో అప్రకటిత సెలవు నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియాలో ఇంతకుముందు ఏ క్రికెట్ మ్యాచ్‌కు కూడా ఇంత ఆసక్తి కనబడలేదని ప్రపంచకప్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఐదుసార్లు భారత్, పాక్ జట్లు తలపడగా ప్రతిసారీ భారత్‌దే పైచేయి అయ్యింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Pakistan match  100 million viewers  world cup  

Other Articles