Talk war between rahul dravid and saurav ganguly on sachin autobiography book in the chappell episode

rahul dravid, saurav ganguly, sachin tendulkar, graig chappell, sachin auto biography, playing it my way book, indian cricket players, international cricket players, sachin comments graig chappell, bowler zaheer khan, harbhajan singh, telugu news

talk war between rahul dravid and saurav ganguly on sachin autobiography book in the chappell episode

ద్రవిడ్, గంగూలీ మధ్య చిచ్చురేపిన సచిన్ ఆత్మకథ!

Posted: 11/05/2014 01:43 PM IST
Talk war between rahul dravid and saurav ganguly on sachin autobiography book in the chappell episode

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ‘‘ప్లేయింట్ ఇట్ మై వే’’ పేరిట రాసుకున్న ఆత్మకథలో గ్రెగ్ చాపెల్ మీద సంచలన వ్యాఖ్యలు సంధించిన సంగతి తెలిసిందే! చాపెల్ ను ‘‘రింగ్ మాస్టర్’’గా పోల్చిన సచిన్... అతను కోచ్ గా వున్న సమయంలో ఆటగాళ్లు ఎన్ని సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందో అన్ని వివరించాడు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లయిన ద్రవిడ్, గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ ఇంకా ఇతరుల మీద చాపెల్ వ్యవహార శైలి ఎలా వుండేదో మొత్తం వివరించాడు. చివరికి చాపెల్ వల్లే 2007లో వరల్డ్ కప్ ఓడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే సచిన్ కు మద్దతుగా సీనియర్ ఆటగాళ్లు తమ మద్దతును ప్రకటించారు. సచిన్ తన ఆత్మకథలో చాపెల్ పై చేసిన ఆరోపణలు నిజమేనని గొంతు విప్పారు. ఈ సందర్భంగా గంగూలీ కొన్ని వ్యాఖ్యలు సంధించాడు. అయితే ఇప్పుడా వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

చాపెల్ గురించి సచిన్ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ స్పందిస్తూ.. చాపెల్ ను నియంత్రించే స్థితిలో తానులేనని ఓ సందర్భంలో ద్రవిడ్ అన్నట్లు పేర్కొన్నాడు. అయితే ఈ వ్యాఖ్యల్ని ద్రవిడ్ ఖండించాడు. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘చాపెల్ ను నేను నియంత్రించలేకపోయాననే అభిప్రాయం గంగూలీకి వుంటే వుండనివ్వండి. కానీ తన అభిప్రాయాన్ని నా మాటల్లో చెప్పడం సబబు కాదు. నాకు, గంగూలీకి మధ్య ఎన్నడూ అలాంటి సంభాషణ జరగలేదు. నేను అలా అనలేదు కూడా!’’ అని స్పష్టం చేశాడు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లపై మలుపు తిరిగింది. చాపెల్ విషయాన్ని కాస్త పక్కనపెట్టి.. వీరిద్దరి వాదనల మీదే దృష్టి సారించారు. ఒకవేళ ఇద్దరి మధ్య గతంలో వున్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే ఇలా ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారా..? లేక వేరే విషయం ఏమైనా వుందా..? అంటూ సందేహాల్లో మునిగిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul dravid  saurav ganguly  sachin tendulkar  graig chappell  playing it my way book  

Other Articles